ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అనడంలో మరో మాట లేదు. బాలీవుడ్ జనాలు ఈ విషయాన్ని అంగీకరించాల్సిందేనని సలార్, కల్కి చిత్రాల ఫలితాలతో స్పష్టమైంది. ప్రభాస్ క్యామియో రోల్ చేసినా చాలు ఆ సినిమా బిజినెస్ లెక్కలు మారిపోయే పరిస్థితి ఉందిప్పుడు. మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’ కూడా అలాగే రేంజ్ పెంచుకుంది. బాలీవుడ్లోనూ ప్రభాస్ క్యామియోతో సినిమాకు హైప్ పెంచుకోవడానికి ఓ సినిమా చూస్తున్నట్లు సమాచారం.
హిందీలో కమర్షియల్, మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రోహిత్ శెట్టి త్వరలోనే ‘సింగమ్ అగైన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యామియో రోల్ చేస్తున్న సంకేతాలు కనిపించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రోమోను రోహిత్ శెట్టి రిలీజ్ చేశాడు.
ఆ వీడియోలో కల్కి సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ వినిపిస్తుండగా.. గాల్లోంచి ఎగురుతూ కిందికి దిగిన వీడియో కనిపించింది. “ఈ హీరో లేకుండా సింగమ్ అసంపూర్ణంగా ఉంటుంది. ఈ వాహనంలో హీరో ఉన్నాడు. దీపావళికి అందులోంచి దిగుతాడు” అని రోహిత్ శెట్టి ఈ వీడియోకు వ్యాఖ్య జోడించాడు. కల్కి మ్యూజిక్ వినిపించింది అంటే కచ్చితంగా ఆ వాహనంలో ఉన్నది ప్రభాసే అని.. అతను క్యామియో రోల్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
అంతే కాక ‘సింగమ్ సిరీస్’లో వచ్చే తర్వాతి చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తాడనే ప్రచారం కూడా మొదలైపోయింది. అదెంత వరకు నిజమో కానీ.. ‘సింగమ్ అగైన్’లో ప్రభాస్ క్యామియో మాత్రం కన్ఫమ్ అనే భావిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సింగమ్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘సింగమ్’ సూపర్ హిట్ కాగా.. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘సింగమ్ రిటర్న్స్’ కూడా బాగానే ఆడింది. ఆ రెండు చిత్రాల్లో హీరోగా నటించిన అజయ్ దేవగణే ‘సింగమ్ అగైన్’లోనూ లీడ్ రోల్ చేశాడు.
This post was last modified on September 4, 2024 10:55 am
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…