Movie News

మహేష్ పాట.. మెగా కుర్రాడి టైటిల్

సూపర్ హిట్ పాటల పల్లవుల్లోంచి సినిమాల టైటిల్స్ తీసుకోవడం ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే. రావోయి చందమామ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, చెప్పవే చిరుగాలి, పిల్లా నువ్వు లేని జీవితం.. ఇలా ఈ వరుసలో పదులకొద్దీ టైటిళ్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ కోవలోకి మరో టైటిల్ చేరబోతున్నట్లు సమాచారం.

మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్.. తన కొత్త చిత్రానికి మహేష్ బాబు సినిమా పాటలోని పల్లవిని టైటిల్‌గా పెట్టుకుంటున్నాడట. ఆ పాట సూపర్ స్టార్ నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంలోనిది. అందులో ‘వచ్చాడయ్యో సామీ’ అంటూ కైలాష్ ఖేర్ పాడిన పాట ఎంత ఫేమస్సో తెలిసిందే. ఆ పద బంధాన్నే వైష్ణవ్ కొత్త చిత్రానికి టైటిల్‌గా పెడుతున్నారట. ఈ చిత్రాన్ని లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య రూపొందించనున్నాడు. టైటిల్ చూస్తే ఇది హీరోయిజం ఎలివేట్ అయ్యే అవకాశాలున్న కథే అనిపిస్తోంది.

‘ఉప్పెన’ మూవీతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌కు ఆ తర్వాత ఏ సినిమా కూడా కలిసి రాలేదు. కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ.. ఇలా వరుసగా తన చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. ‘ఆదికేశవ’ అయితే తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని కొత్త సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు వైష్ణవ్.

కృష్ణచైతన్య విషయానికి వస్తే.. ‘రౌడీ ఫెలో’తో ప్రామిసింగ్ డెబ్యూ ఇచ్చిన కృష్ణచైతన్య.. ఆ తర్వాత ‘ఛల్ మోహన రంగ’తో జస్ట్ ఓకే అనిపించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి అంచనాలతో రిలీజైంది కానీ.. ఇది కూడా నిరాశ పరిచింది. దీంతో మళ్లీ కెరీర్లో గ్యాప్ తప్పదేమో అనిపించింది. కానీ వెంటనే మెగా కుర్రాడితో సినిమా ఓకే చేసుకున్నాడు. ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

This post was last modified on September 4, 2024 10:33 am

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

50 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

1 hour ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago