ఇటీవలే నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన కొత్త సిరీస్.. ‘ఐసీ 814: ది ఖాందహార్ హైజాక్’ తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఈ సిరీస్ ఒక్క విషయంలో మాత్రం తీవ్ర విమర్శల పాలవుతోంది.
ఖాందహార్ హైజాక్‌లో భాగమైంది ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఇస్లామిక్ ఉగ్రవాదులే నాడు ఈ హైజాక్‌కు పాల్పడ్డారు. అందులో నిందితుల పేర్లు కూడా అప్పుడే బయటికి వచ్చాయి. ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్.. ఇవీ ఖాందహార్ హైజాక్ నిందితుల అసలు పేర్లు. వీళ్లందరూ ముస్లింలే అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఈ సిరీస్‌లో మాత్రం వాళ్ల పేర్లను మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్.. అంటూ వేరు పేర్లతో సంబోధించారు.
పనిగట్టుకుని ఇలా ముస్లింల పేర్లను మార్చి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇది రాను రాను వివాదాస్పదంగా మారి.. ఈ సిరీస్‌ను బాయ్‌కాట్ చేయాలనే ఉద్యమం సోషల్ మీడియాలో మొదలైంది. వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లి.. నెట్ ఫ్లిక్స్ హెడ్‌కు సమన్లు వెళ్లాయి.
తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిత్వ శాఖ అధికారుల ముందుకు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైజాకర్ల పేర్లు మార్చడం, వాళ్లలో కొందరిని మానవతావాదులుగా చూపించడం.. హైజాక్ సమయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని చెడుగా చూపించడం మీద మోనికాను అధికారులు ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. ఇకపై కంటెంట్ విషయంలో జాగ్రత్త పడతామని, భారతీయ ప్రేక్షకుల మనోభావాలకు అనుగుణంగా సినిమాలు, సిరీస్‌లు ఉండేలా చూసుకుంటామని మోనికా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘ఐసీ 814’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగిన ఉద్యమం నెట్ ఫ్లిక్స్‌ను గట్టి దెబ్బే కొట్టినట్లుంది.
This post was last modified on September 3, 2024 10:36 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…