తెలుగు ప్రేక్షకులు.. తమిళ హీరోల మీద ఎంత ప్రేమ చూపిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ తమిళ ప్రేక్షకులు మన హీరోలను అలా ఆదరించరు. తమిళంలో ఆడే తెలుగు సినిమాలు అరుదు. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలను కూడా వాళ్లు పట్టించుకోరు. కానీ యువ కథానాయకుడు నానికి మాత్రం తమిళంలో కొంచెం ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ‘వెప్పం’ అనే డైరెక్ట్ మూవీ చేయడం ద్వారా తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు నాని.
అలాగే ‘ఈగ’ సినిమా సైతం తమిళంలో బాగా ఆడి నాని ఫాలోయింగ్ పెంచింది. కానీ ఆ తర్వాత తమిళ మార్కెట్ మీద నాని పెద్దగా దృష్టిపెట్టలేదు. దసరా, హాయ్ నాన్న చిత్రాలు తమిళంలో రిలీజైనా నామమాత్రమే. ఐతే ఇప్పుడు నాని కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ మాత్రం తమిళంలో బలమైన ముద్రే వేస్తోంది. అక్కడ సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోందీ చిత్రం.
ఇతర భాషల్లో ‘సూర్యాస్ సాటర్‌డే పేరుతో రిలీజైందీ చిత్రం. హిందీలో ఈ సినిమా రిలీజ్ నామమాత్రమే. కన్నడ వెర్షన్ అసలు రిలీజే కాలేదు. కానీ కర్ణాటకలో తెలుగు వెర్షనే బాగా ఆడుతోంది. మలయాళంలో పరిస్థితి పర్వాలేదు. ఐతే తమిళంలో మాత్రం ‘సూర్యాస్ సాటర్‌డే’ అదరగొడుతోంది.
ఎస్.జె.సూర్య విలన్ పాత్ర చేయడం వల్ల కావచ్చు, ప్రమోషన్ల వల్ల కావచ్చు.. ముందు నుంచే ‘సూర్యాస్ సాటర్ డే’కి తమిళంలో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక రిలీజ్ దగ్గర్నుంచి ప్రేక్షకుల స్పందన కూడా చాలా బాగుంది. విశేషం ఏంటంటే.. తెలుగుతో పోలిస్తే తమిళంలోనే ఈ సినిమాకు బెటర్ టాక్, రివ్యూలు వచ్చాయి. ‘ఎక్స్’లో పోస్టులన్నీ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అందరూ నాని, సూర్యలను కొనియాడుతున్నారు. ఓవరాల్‌గా సినిమానూ పొగుడుతున్నారు.
సినిమా తొలి రోజు నుంచి మంచి వసూళ్లతో నడుస్తోంది. శని, ఆదివారాల్లో ఈవెనింగ్, నైట్ షోలు మంచి ఆక్యుపెన్సీలతో నడిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘సరిపోదా శనివారం’ ఓవరాల్ కలెక్షన్లలో తెలుగు వెర్షన్ మినహాయిస్తే.. మేజర్ కంట్రిబ్యూషన్ తమిళం నుంచే వస్తోంది. అక్కడ సినిమా పది కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఓ తెలుగు సినిమాకు తమిళంలో ఈ స్థాయిలో వసూళ్లంటే విశేషమే.
This post was last modified on September 2, 2024 2:04 pm
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…