Movie News

చిరు చెప్పాడు.. అభిమానులు పాటిస్తారా?

ఒకప్పడు ఫ్యాన్ వార్స్ బయట ఓ మోస్తరు స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు వారికి సోషల్ మీడియా రూపంలో మంచి వేదిక దొరికింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఇక్కడ గొడవలే గొడవలు. తమ హీరోను కొనియాడడం కంటే.. అవతలి హీరోను కించపరచడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం అవుతోంది.

ఓవైపు హీరోలు స్నేహంగానే మెలిగే ప్రయత్నం చేస్తున్నా.. అభిమానుల మధ్య ద్వేషం మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ శాంతి మంత్రం బోధించే ప్రయత్నం చేశారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకకు చిరు అతిథిగా రావడమే కాదు.. బాలయ్య గురించి ఏ భేషజం లేకుండా గొప్పగా మాట్లాడారు. అదే సమయంలో అభిమానులను ఉద్దేశించి కూడా కొన్ని మంచి మాటలు చెప్పారు.

తాను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ‘సమరసింహారెడ్డి’ స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని వెల్లడించడమే కాదు.. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలన్న కోరికను బయటపెట్టాడు చిరు. తమ ఇంట్లో ఏ శుభకార్యం కూడా బాలయ్య లేకుండా పూర్తి కాదని.. తమ ఇద్దరి అభిమానులు కలిసి కట్టుగా ఉండేందుకే కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లమని చిరు వెల్లడించడం విశేషం.

తామంతా ఓ కుటుంబం లాంటి వాళ్లమని.. ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చిరు నొక్కి చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరిగినపుడల్లా.. హీరోలు హీరోలు బాగానే ఉంటారు, ఫ్యాన్సే కొట్టుకు చస్తుంటారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ శ్రుతి మించి.. ఒకే ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన అభిమానుల మధ్య కూడా విద్వేషాలు తీవ్ర స్థాయికి చేరుకుని అదే పనిగా విషం చిమ్ముకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే చిరు.. బాలయ్య గురించి గొప్పగా మాట్లాడ్డమే కాక, వ్యక్తిగతంగా తామెంత సన్నిహితంగా ఉంటామో చెబుతూ అభిమానులు కూడా అంతే స్నేహంగా మెలగాలని చెప్పకనే చెప్పారు. మరి మెగా, నందమూరి ఫ్యాన్సే కాక.. అందరు అభిమానులూ ఈ విషయాన్ని గుర్తించి సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని తగ్గిస్తే మంచిది.

This post was last modified on September 2, 2024 2:12 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago