మెగా నందమూరి కుటుంబాల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పటిది కాదు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు పరస్పరం దీని గురించి రకరకాల రూపాల్లో యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. పలు వేదికలపై ఇవన్నీ నిజం కాదని స్వయంగా హీరోలే చెప్పినా సరే అంత సులభంగా ఫ్యాన్స్ ని ఒప్పించలేని పరిస్థితి. బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో దీనికి మంచి క్లారిటీ ఇచ్చారు. ఎవరి పనులు, ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి తరచుగా కలుసుకోవడం ఉండదని, అంత మాత్రాన ఏవో గొడవలు ఉన్నట్టు ప్రచారం చేయడం సరికాదని కుండబద్దలు కొట్టారు.
రామ్ చరణ్, బన్నీలాంటి వాళ్ళతో క్లోజ్ గా ఉంటానని వాళ్ళను బాబు అంటూ బాలయ్య సంబోధించడం ఇంటర్వ్యూలోనే హైలైట్ గా చెప్పొచ్చు. పిల్లలు పైకి వస్తుంటే సంతోషం కలుగుతుందని వీళ్ళ ప్రస్తావన తేవడం విశేషం. నిజానికి గత ఏడాదే అన్ స్టాపబుల్ షో ద్వారానే వీటికి బాలయ్య చెక్ పెట్టారు. ఆయన చేస్తున్నారనే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అడవి శేష్, శర్వానంద్, విశ్వక్ సేన్ లాంటి స్టార్లు గెస్టులుగా వచ్చారు. అంతే తప్ప ఆహా వేదికగా జరుగుతోందని కాదు. ఇప్పుడు మరో రూపంలో దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు బాలయ్య.
స్వర్ణోత్సవ సంబరంలో ఉన్న బాలకృష్ణ యాభై నట సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన వేడుకకు భారీగా తరలివచ్చారు. బాబీ దర్శకత్వంలో సితార సంస్థ నిర్మిస్తున్న ఎన్బికె 109 షూటింగ్ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబర్ లేదా జనవరి విడుదలకు ప్లానింగ్ జరుగుతోందని అంటున్నారు కానీ ఖరారుగా డేట్ ఇంకా చెప్పలేదు. సంక్రాంతికి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ల హోరాహోరి పోరుని కనులారా చూసుకోవచ్చు.
This post was last modified on September 2, 2024 11:06 am
చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉంది. విడుదల తేదీ ప్రకటిస్తే బిజినెస్ జరిగిపోతుంది. కానీ భైరవం టీమ్ మీనమేషాలు లెక్కబెడుతున్న తీరు ఆశ్చర్యం…
వైసీపీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…
భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…
పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…