సూర్య కెరీర్లోనే అత్యధిక అంచనాలతో రాబోతున్న సినిమా.. కంగువ. దీని ప్రోమోలు చూస్తే బాహబలి తరహాలో సంచలనం రేపుతుందా అనే అంచనాలు ఏర్పడుతున్నాయి. దర్శకుడు శివ ఇప్పటిదాకా రొటీన్ మాస్ మూవీసే తీశాడు కానీ.. ఇది వేరే లెవెల్ అనిపిస్తోంది. రెండున్నరేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను ఎట్టకేలకు అక్టోబరు 10న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చారు.
అక్టోబరు 10 నుంచి ‘కంగువ’ వాయిదా పడుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఇది జస్ట్ రూమర్ అనుకున్నారు కానీ.. తాజాగా సూర్యనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అక్టోబరు 10కే షెడ్యూల్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయాన్’ కోసం తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పకనే చెప్పేశాడు. ఇది సూర్య అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది.
సూర్య అండ్ టీం చేస్తున్న త్యాగంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్టోబరు 10 అంటే దసరా సెలవుల్లో వచ్చే వీకెండ్. అప్పుడు తెలుగు, హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ‘కంగువ’కు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉండగా.. అక్టోబరు 10 రిలీజైతే బాక్సాఫీస్ షేకైపోయేది. మళ్లీ ఈ చిత్రానికి అంత మంచి డేట్ దక్కకపోవచ్చు. నిజానికి ‘కంగువ’ రిలీజ్ డేట్ ముందే ఖరారైన నేపథ్యంలో వెనక్కి తగ్గాల్సింది రజినీ మూవీనే. అంచనాల పరంగా చూసినా కూడా సూర్య మూవీనే ఒక మెట్టు పైన ఉంటుంది. ఈ సినిమా స్కేల్, పెట్టిన బడ్జెట్ ఇవన్నీ చూసుకుని రజినీ సినిమా టీంనే వెనక్కి తగ్గేలా ఒప్పించాల్సింది. ఈ డేట్ మిస్సయితే మళ్లీ ఇంకో మంచి డేట్ దొరకడం అంత తేలిక కాదు.
దీపావళికి హిందీలో రెండు భారీ చిత్రాలు లైన్లో ఉన్నాయి. తమిళంలో అజిత్ మూవీ ‘విడాముయర్చి’, శివ కార్తికేయన్ సినిమా ‘అమరన్’ రిలీజ్ కానున్నాయి. తెలుగులో లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ లాంటి సినిమాలు వస్తున్నాయి. అప్పుడు చాలినన్ని థియేటర్లు దొరక్కపోవచ్చు. అంత పోటీ మధ్య వసూళ్ల మీద కూడా ప్రభావం పడుతుంది. డిసెంబరు, జనవరి నెలల్లో ఆల్రెడీ అన్ని డేట్లూ ప్యాక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ‘కంగువ’కు మంచి డేట్ దొరకడం కష్టమే.
This post was last modified on September 1, 2024 7:10 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…