సరిపోదా శనివారంలో ఎస్జె సూర్య పెర్ఫార్మన్స్ ఆ సినిమాని నిలబెట్టడంలో ఎంతగా దోహద పడిందో ఎవరైనా ఒప్పుకునే విషయమే. సాక్ష్యాత్తు హీరో నానినే దయా పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కితే సంతోషపడతాడని, షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఇదే చెప్పానని సక్సెస్ మీట్ లో అనడం ఫ్యాన్స్ ని తాకింది. ఇప్పటిదాకా ఎస్జె సూర్య ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు కానీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్టు పరిస్థితి మారిపోయింది. మహేష్ బాబు స్పైడర్ లోనే తన టాలెంట్ చూపించినా అసలైన టాలీవుడ్ బ్రేక్ మాత్రం ఇన్నేళ్ల తర్వాత దొరికింది.
ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ వైపు వెళ్తోంది. అందులో కూడా ఎస్జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఎంత స్కోప్ ఉంటుందనే దాని గురించి క్లారిటీ లేదు. యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సరిపోదా శనివారంకు ఏ మాత్రం తీసిపోని రీతిలో, ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనేలా దర్శకుడు శంకర్ డిజైన్ చేశారని చెబుతున్నారు. మెయిన్ విలన్ గా నటించిన సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకుగా ఎస్జె సూర్య ఇందులో రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చరణ్ తో సై అంటే సై అనిపించే ఛాలెంజింగ్ సీన్లు బోల్డు ఉంటాయట.
ఇంకా చెప్పాలంటే ఒకే ఒక్కడులో అర్జున్ రఘువరన్ మధ్య క్లాష్ ని మించి ఉంటుందని ఊరిస్తున్నారు. నిజంగా ఈ స్థాయిలో అంచనాలు అందుకోగలిగితే మాత్రం గేమ్ ఛేంజర్ దెబ్బకు ఎస్జె సూర్య రేంజ్ మరింత పైకి చేరుకుంటుంది. ఇప్పటికే పది కోట్ల దాకా రెమ్యునరేషన్ పలుకుతోందనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో ఖరారుగా తెలియదు. ఎందుకంటే కొందరు టైర్ 2 హీరోలకే అంత పారితోషికం లేదు. అయినా మనాడు, మార్క్ ఆంటోనీ లాంటి బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యాక ఇతని డిమాండ్ మాములుగా లేదు. చూడాలి మరి గేమ్ ఛేంజర్ ఇంకెంత పెద్ద స్థాయికి తీసుకెళ్తుందో.
This post was last modified on September 1, 2024 6:00 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…