Movie News

కొత్త సిరీస్ హిట్.. కానీ ఇది న్యాయమా?

థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు తీయడంలో బాలీవుడ్ దర్శకుల నైపుణ్యమే వేరు. ఓటీటీలు ఊపందుకున్నాక వాటిలో ఎక్కువ విజయవంతం అయినవి బాలీవుడ్ డైరెక్టర్లు తీసిన సిరీస్‌లే. ఈ కోవలోనే నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన కొత్త సిరీస్.. ‘ఐసీ 814: ది ఖాందహార్ హైజాక్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద్ స్వామి, దియా మీర్జా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్‌గా ఉండి ప్రేక్షకులకు ఉత్కంఠ పంచుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సిరీస్‌ల్లో ఇదొకటిగా విమర్శలు ప్రశంసిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో ఇది ఇండియా వరకు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సిరీస్ ఒక్క విషయంలో మాత్రం విమర్శల పాలవుతోంది.

ఖాందహార్ హైజాక్‌లో భాగమైంది ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఇస్లామిక్ ఉగ్రవాదులే నాడు ఈ హైజాక్‌కు పాల్పడ్డారు. అందులో నిందితుల పేర్లు కూడా అప్పుడే బయటికి వచ్చాయి. ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్.. ఇవీ ఖాందహార్ హైజాక్ నిందితుల అసలు పేర్లు. వీళ్లందరూ ముస్లింలే అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఈ సిరీస్‌లో మాత్రం వాళ్ల పేర్లను మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్.. అంటూ వేరు పేర్లతో సంబోధించారు. పనిగట్టుకుని ఇలా ముస్లింల పేర్లను మార్చి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎదురవుతోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటారన్నది విమర్శ. తమిళంలో ఆ మధ్య వచ్చిన ‘జై భీమ్’ సినిమాలో కూడా బాధితుడి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి క్రిస్టియన్ అయితే.. సినిమాలో మాత్రం హిందువుగా చూపించారు. దాని పట్ల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఉగ్రవాదులు ముస్లింలు అయితే.. ఆ విషయం కప్పిపుచ్చేలా ఈ సిరీస్ తీయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

This post was last modified on September 1, 2024 6:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌చ్చ‌.. ఎందుకీ ఆరాటం?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి కేవలం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోస‌మే ఆరాట‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు…

49 minutes ago

ఆరో ‘ఆట’ రద్దు.. ఏపీలో ఇకపై 5 ‘ఆట’లే

ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…

2 hours ago

గ్రామాల్లోనే టెంట్లు… వాటిలోనే పవన్ బస

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…

2 hours ago

డాకు మహారాజ్ చాలానే దాచి పెట్టాడు

https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…

3 hours ago

`బ్రాండ్ ఏపీ బిగిన్‌`: చంద్ర‌బాబు

బ్రాండ్ ఏపీ ప్రారంభ‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అత‌లాకుత‌ల‌మైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామ‌ని చెప్పారు.…

3 hours ago

తప్పు జరిగిపోయింది.. ఇకపై జరగనివ్వం: బీఆర్ నాయుడు

తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…

3 hours ago