నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షలు చూస్తుంటే జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కానీ టాలీవుడ్ ఆడియన్స్ ప్రేమ నెక్స్ట్ లెవెలని సరిపోదా శనివారం వసూళ్లు ఋజువు చేస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి పలు నగరాలతో సహా చాలా చోట్ల వానలు జనజీవనంతో ఆడుకుంటున్నప్పటికీ తెలుగువాడి వినోదానికి ప్రధాన సాధనమైన వెండితెరను మాత్రం ఆపలేకపోతున్నాయి. నిన్న బుక్ మై షో యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడమే దీనికి సాక్ష్యం. పేటిఎం, కరెంట్ సేల్స్ లెక్కలు వేరే అదనంగా ఉంటాయి.
నిన్న రాత్రికే యాభై కోట్ల లాంఛనాన్ని పూర్తి చేసుకున్న సరిపోదా శనివారం ఇదే దూకుడు ఆదివారం కూడా కొనసాగించనుంది. మంచి టాక్ తో పాటు పోటీలో ఏ సినిమా లేకపోవడం శనివారం సూర్యకు కలిసి వస్తోంది. వరద వాతావరణం ఉన్న కొన్ని సెంటర్లు మినహాయించి చిన్నపాటి జల్లులు ఉన్న కేంద్రాల్లో వాటిని పబ్లిక్ లెక్క చేయడం లేదు. సినిమాలకు వెళ్తున్నారు. సక్సెస్ మీట్ తో పాటు డివివి టీమ్ చేస్తున్న ప్రమోషన్లు టాక్ ని కాపాడుకుంటూ వస్తున్నాయి. వచ్చే వారం చెప్పుకోదగ్గ భారీ చిత్రాలు లేకపోవడం వల్ల ఇంకో వీకెండ్ కలిసి వస్తుందనే నమ్మకం ఎగ్జిబిటర్లలో కనిపిస్తోంది.
యుఎస్ లో మొదటివారం కాకుండానే ఒకటిన్నర మిలియన్ దాటేసిన సరిపోదా శనివారం డబుల్ మార్కు అందుకోవడం ఈజీనే కానీ ఫైనల్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందనేది ఇప్పుడే చెప్పలేం. మాస్ కోసం సరైన సినిమా రాలేదని వెలితిగా నడిచిన ఆగస్ట్ కు బ్రహ్మాండమైన ముగింపు దొరికింది. హైదరాబాద్ లో 25 సింగల్ స్క్రీన్లలో వీకెండ్ లో ఒక్క టికెట్ దొరికే పరిస్థితి లేదంటే ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వర్షాలు లేకపోయి ఉంటే డే వన్ కన్నా డే త్రీ గ్రాస్ ఎక్కువగా వచ్చేది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో హ్యాపీగా ఉన్న నాని మరో వారం పదిరోజులు దీని ప్రమోషన్ మీద దృష్టి సారించనున్నాడు.
This post was last modified on September 1, 2024 11:50 am
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…