మలయాళ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా చర్చలన్నీ ‘హేమ కమిటీ’ రిపోర్ట్ గురించే. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో అనేకమంది ప్రముఖులకు సంబంధించిన చీకటి కోణాలు బయటికి వచ్చాయి.
మరోవైపు కొత్తగా అనేకమంది మహిళలు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి రాధిక అలాంటి ఒక ఎపిసోడ్ గురించి వెల్లడించింది. తాను షూటింగ్‌లో పాల్గొన్న ఓ సినిమా యూనిట్లో కొందరు మహిళా ఆర్టిస్టులు ఉపయోగించే కారవాన్లలో కెమెరాలు పెట్టి వీడియోలు తీసిన విషయం తెలిసి తాను షాకైనట్లు ఆమె వెల్లడించారు.
“నేను 46 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. అన్ని చోట్లా మహిళలకు లైంగిక పరమైన వేధింపులు ఎదురవుతున్నాయన్నది నా భావన. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినపుడు జరిగిన ఉదంతాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. షాట్ ముగించుకుని వెళ్తుండగా.. సెట్లో కొంతమంది మగవాళ్లు ఒక చోట కూర్చుని ఫోన్లో ఏదో చూసి ఆనందిస్తున్న విషయం గమనించా. ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. యూనిట్లో ఒక వ్యక్తిని పిలిచి వాళ్లేం చూస్తున్నారని అడిగా. కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి ఫోన్లలో చూస్తున్నారని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చి చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. ఇలాంటివి జరిగితే గట్టిగా బుద్ధి చెబుతానని వార్నింగ్ ఇచ్చా. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి ఉపయోగించే కారవాన్లలో కూడా ఇలాంటివి చేస్తే ఏం చేయాలి” అని రాధిక అన్నారు.
This post was last modified on September 1, 2024 10:29 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…