ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలతో మన చిత్రాలను పోల్చడం కూడా పెద్ద సాహసం అనిపించేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని సినిమాలు వస్తున్నాయి. రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ను చూసి జేమ్స్ కామెరూన్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలే ఆశ్చర్యపోయారు. ఇక ఇటీవలే ఓ సినిమా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించి, అక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థ అధికారికంగా రీమేక్ హక్కులు కొని మరీ రీమేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆ చిత్రమే.. కిల్.
లక్ష్య అనే అప్ కమింగ్ నటుడిని హీరోగా పెట్టి నిఖిల్ నగేష్ భట్ అనే యువ దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మునుపెన్నడూ చూడని నాన్ స్టాప్ యాక్షన్‌తో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ యాక్షన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. జులై 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఐతే థియేటర్లలో చూడలేని వాళ్లు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ సెప్టెంబరు 6న ఫలించబోతోంది. ఆ రోజు నుంచే డిస్నీ హాట్ స్టార్ సంస్థ ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయబోతోంది. ‘కిల్’ మూవీ ఇండియాలో రిలీజవ్వడానికంటే చాన్నాళ్ల ముందే టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలకు కొన్ని రోజుల ముందే ప్రెస్, ఫిలిం సెలబ్రెటీలకు స్పెషల్ షోలు వేశారు. అప్పుడే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ ప్రకారమే యాక్షన్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంది.
ఒక రైల్లోకి చొరబడ్డ దొంగల ముఠా హీరో కుటుంబాన్ని తన కళ్ల ముందే అంతమొందిస్తుంది. దీంతో హీరో అక్కడికి వచ్చిన దొంగలతో పాటు వారి ముఠా మొత్తాన్ని ఎలా అంతం చేశాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. చాలా హింసాత్మకంగా సాగుతుందీ చిత్రం.
This post was last modified on August 31, 2024 2:23 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…