సత్యరాజ్, రమ్యకృష్ణ, నివేత పేతురాజ్, రెజీనా కసెండ్రా, జయరాం, శ్యామ్, నాజర్ ఇలా ఇంత పెద్ద సీనియర్ అండ్ జూనియర్ క్రేజీ క్యాస్టింగ్ తో ఒక సినిమా తీసినప్పుడు దానికి ఖచ్చితంగా క్రేజ్ వస్తుంది.
పైగా గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వెంకట్ ప్రభు దర్శకుడైతే ఇక చెప్పేముంది. కానీ షూటింగ్ పూర్తయినా ఏడేళ్లుగా సదరు మూవీ ల్యాబ్ లోనే మగ్గుతోందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దాని పేరు పార్టీ. 2017లో మొదలుపెట్టి రెండేళ్లలోనే గుమ్మడికాయ కొట్టారు. కానీ అదిగో ఇదిగో అంటూ నానబెడుతూ చివరికి ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ కు సిద్ధం చేయడం విశేషం.
దీని వెనుకో ఆసక్తికరమైన కథ ఉంది. పార్టీని ఫిజి ద్వీపంలో చిత్రీకరించారు. అప్పట్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే అక్కడ కనుక షూటింగ్ చేస్తే 47 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఆఫర్ బాగుందని మొత్తం అక్కడే తీశారు.
కట్ చేస్తే కరోనా వచ్చి ఫిజిలో పరిస్థితులు తలకిందులయ్యాయి. టూరిజం పడిపోయింది. దీంతో ఆ నలభై ఏడు మినహాయింపుని ఎత్తేశారు. అగ్రిమెంట్ లో రిలీజ్ చేయక ముందే రాయితీ పొందాలనే నిబంధన పొందుపరచడంతో పార్టీని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఫిజి సర్కారు సానుకూలంగా మారడంతో పార్టీ పనులు వేగవంతం చేశారు.
వెంకట్ ప్రభు విజయ్ తో తీసిన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం మీదున్న క్రేజ్ ఖచ్చితంగా పార్టీకి ఉపయోగడుతుందని భావిస్తున్న నిర్మాతలు సినిమాని డిసెంబర్ లోగా థియేటర్లకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంచి టెక్నీషియన్లతో పాటు భారీ క్యాస్టింగ్ నటించిన పార్టీని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ తీసుకొస్తున్నారు. అన్నట్టు ఆ నలభై ఏడు శాతం డిస్కౌంట్ సంగతేమో కానీ ఇన్ని సంవత్సరాలు పెట్టుబడి మీద వడ్డీల భారం మోసుకుంటూ వచ్చిన ప్రొడ్యూసర్ కి ఈ ప్రాజెక్టు ఏం మిగిలిస్తుందో చూడాలి.కొన్ని సినిమాల తెరవెనుక కథలు ఇంతే. కామెడీలో ట్రాజెడీలాగా.
This post was last modified on August 31, 2024 12:21 pm
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…
ప్రస్తుతం విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్, రష్యా సహా..…
టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…