Categories: Movie News

శనివారం జోరు….భారీ వర్షాల బేజారు

న్యాచురల్ స్టార్ నానికి హ్యాట్రిక్ హిట్ అందించే దిశగా దూసుకుపోతున్న సరిపోదా శనివారంకు భారీ వర్షాలు స్పీడ్ బ్రేకుల్లా మారుతున్నాయి. హఠాత్తుగా నిన్న సాయంత్రం నుంచి తుఫాను తరహా వాతావరణం కమ్మేయడంతో ఎక్కడిక్కడ జనజీవనం స్థంభించింది.

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీకెండ్ కావడం వల్ల ఈ మూవీకి శని ఆదివారాలు చాలా కీలకం. ఒక్క హైదరాబాద్ నుంచే ఈ రోజు రెండు కోట్ల అడ్వాన్స్ గ్రాస్ వచ్చింది. కరెంట్ బుకింగ్స్ ఎక్కువగా జరిగే మాస్ సెంటర్ల నెంబర్లు ఇప్పుడీ వానల వల్ల హెచ్చుతగ్గులకు గురయ్యే ఛాన్స్ ఉంది.

ఇంకో రెండు మూడు రోజులు వర్షాలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఎంత వర్షం వచ్చినా ప్రజలు తమ వృత్తులు, పనులు మానుకుని ఇళ్లలో ఉండరు. కానీ అదేపనిగా తుడుచుకుంటూ, ఇబ్బంది పడుతూ థియేటర్లకు వెళ్లడం అంత సులభంగా ఉండదు. అందులోనూ నగరాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

టికెట్లు బుక్ చేసుకున్నా ట్రాఫిక్ జామ్ కు భయపడి ఆగిపోయే వాళ్ళు కొందరైతే నేరుగా కొందామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు మరో ఆలోచన లేకుండా మనసు మార్చుకుంటారు. ఇదంతా సరిపోదా శనివారంకు ఇబ్బంది కలిగించే పరిణామమే.

యూనిట్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారమే మొదటి రోజు ఇరవై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సరిపోదా శనివారం యుఎస్ లో వేగంగా 1 మిలియన్ మార్కు అందుకుంది. పాజిటివ్ టాక్ క్రమంగా ఆక్యుపెన్సీలను పెంచుతోంది.

మరి ఈ వర్షాలు తెరిపినిస్తే మరింత మెరుగైన కలెక్షన్లను చూడొచ్చు. నాని గత మాస్ బ్లాక్ బస్టర్ దసరాని సులభంగా దాటుతుందేమోననే అంచనాలను సరిపోదా శనివారం అందుకోలేకపోతోంది. ఫైనల్ రన్ అయ్యాక దీని గురించి పూర్తి క్లారిటీ వస్తుంది. అంతా సరిపోతోంది అనుకుంటున్న టైంలో ఇప్పుడీ వర్షాలు సరిపోలేనంత టెన్షన్ కలిగిస్తున్నాయి.

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

3 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

4 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago