ప్రభాస్ ఏక్ నిరంజన్ తో మనకు పరిచయమైనా పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైన కంగనా రౌనత్ క్రిష్ దర్శకత్వం వహించిన మణికర్ణికతో మనకు మరింత దగ్గరయ్యింది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఈ ఉంగరాల జుత్తు అమ్మాయి స్వంతంగా డైరెక్ట్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. సెప్టెంబర్ 6 విడుదల కావాల్సిన ఈ చిత్రానికి వివాదాలు చుట్టుముట్టాయి. ఇందిరాగాంధీ 1975 నుంచి 1977 వరకు విధించిన అత్యయిక పరిస్థితి దేశంలో తీవ్ర అలజడికి దారి తీసింది. పౌర హక్కులను అడ్డుకునే చట్టం కావడంతో పాటు ఎన్నికలను సైతం నిలిపేసే వ్యవస్థను తేవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఎమర్జెన్సీ నడిచిన 21 నెలల పాటు ఎదురుకున్న ఆనాటి స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతో కంగన రౌనత్ దాన్ని అదే టైటిల్ తో తెరకెక్కించింది. అప్పట్లో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గురించి కూడా ఇందులో కీలక ప్రస్తావన ఉందట. సదరు నటుడికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సహజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పలు మైనారిటీ వర్గాలతో పాటు పంజాబ్ కు చెందిన కుల సంఘాలు ఎమర్జెన్సీని నిషేదించాలని ఆర్జీలు పెట్టుకున్నాయి. సెన్సార్ బోర్డు సైతం ఇందులో సున్నితత్వాన్ని గుర్తించింది.
గతంలో ఇదే తరహాలో ఇందూ సర్కార్ అనే మూవీ వచ్చింది. కానీ స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో పాటు తీసిన విధానం ఆసక్తికరంగా లేకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. అందుకే ఎక్కువ కాంట్రావర్సికి చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు కంగనా రౌనత్ లాంటి పేరున్న ఆర్టిస్ట్ తీయడంతో ఎక్కడ లేని ప్రచారం వచ్చేసింది. అధికారంలో ఉన్నది బిజెపి ప్రభుత్వం కాబట్టి క్లియరెన్స్ వస్తుందనే కామెంట్ల నేపథ్యంలో ఒకవేళ వివాదం కోర్టు మెట్లు ఎక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. మోక్షం దక్కించుకుని బయటికి వచ్చాక నిజంగా ఊహించినట్టు వివాదాస్పద అంశాలు ఉంటే మాత్రం కంగనాకు ఇబ్బందే.
This post was last modified on August 30, 2024 5:58 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…