డిసెంబర్ లో అయినా పుష్ప 2 వస్తుందా రాదా అనే అనుమానాలు అభిమానుల్లో లేకపోలేదు. ఇప్పటికే బంగారం లాంటి ఆగస్ట్ 15 డేట్ మిస్సయ్యిందని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ఆ అవకాశాన్ని స్త్రీ 2 లాంటి చిన్న బడ్జెట్ సినిమా వాడుకుని అయిదు వందల కోట్లు కొల్లగొట్టడం చూస్తే ఆ మాత్రం ఆవేదన కలగడం సహజం. సరే పాతది తవ్వుకుని లాభం లేదు. కాబట్టి డిసెంబర్ 6 ఖచ్చితంగా రిలీజ్ ఉంటుందా అనే డౌట్ కు మైత్రి అధినేతల్లో ఒకరైన రవి శంకర్ ఇవాళ జరిగిన మత్తువదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా స్పష్టమైన క్లారిటీ వివరాలతో సహా ఇచ్చేశారు.
సెప్టెంబర్ 2కి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తవుతుందని, అక్టోబర్ 6 సెకండాఫ్ ఎడిటింగ్ ఫినిష్ చేసి నవంబర్ 20 కి ఫైనల్ కాపీ సిద్ధంగా ఉంచుతామని అన్నారు. నవంబర్ 25 సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోగొట్టేసి ముందు చెప్పిన ప్రకారమే డిసెంబర్ 6 భారీ ఎత్తున పుష్ప 2 ది రూల్ ని థియేటర్లకు తీసుకొస్తామని అన్నారు. నిజం చెప్పాలంటే ఇంత క్లారిటీతో పుష్ప ఎప్పుడూ వివరాలు ఇవ్వలేదు. షూటింగ్ లో బిజీగా ఉండి సుకుమార్, అల్లు అర్జున్ మీడియాకి దొరక్కుండా ఉన్న నేపధ్యంలో కనీసం ఇప్పటికైనా రవిశంకర్ ద్వారా ఇన్ని డీటెయిల్స్ తెలియడం ఫ్యాన్స్ కి సంతోషం కలిగించేదే.
సో ఎలాంటి అనుమానం లేకుండా రిలీజ్ సంబరాలకు రెడీ అయిపోవచ్చు. బిజినెస్ వ్యవహారాలు ఏరియాల వారీగా మెల్లగా క్లోజ్ చేయబోతున్నారు. భారీ క్రేజ్ ఉన్న నేపథ్యంలో అనుకున్నదాని కన్నా ఎక్కువ రేట్లు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్నాయట. ముఖ్యంగా హిందీ బెల్టు నుంచి కనీసం రెండు వందల కోట్ల బిజినెస్ ఆశించవచ్చనేది విశ్లేషకుల అంచనా. పుష్ప 1 ది రైజ్ ఎలాంటి హైప్ లేకుండానే బ్లాక్ బస్టర్ అయ్యింది. దెబ్బకు పుష్ప 2 మీద క్రేజ్ మాములుగా లేదు. ఇంకో మూడు నెలలకు పైగా టైం ఉంది కాబట్టి ప్రమోషన్లకు సంబంధించిన పూర్తి కార్యాచరణ సిద్ధం చేసుకోలేదు.
This post was last modified on August 30, 2024 2:21 pm
పండక్కు రిలీజై హిట్టు కొట్టిన రెండు సినిమాల్లో చైల్డ్ ఎలిమెంట్ కీలక పాత్ర పోషించడాన్ని కొట్టిపారేయలేం. ముందుగా డాకు మహారాజ్…
తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు హైదరాబాద్లో ఎంత పెద్ద స్థాయిలో నిలబడుతోందో తెలిసిందే. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీల్లో…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా…
గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్కు అతి…
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…