సరిపోదా శనివారం తీర్పు స్పష్టంగా వచ్చేసింది. నానికి హ్యాట్రిక్ హిట్ కన్ఫర్మ్ అయ్యింది. లెక్కల సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ తొలుత ఈ సినిమా ప్రకటించినప్పుడు అందరి మదిలో మెదిలిన ప్రశ్న ఒకటే. అంటే సుందరానికి అంచనాలు అందుకోవడంలో విఫలమైతే తిరిగి అదే దర్శకుడికి నాని ఇంకో ఆఫర్ ఇవ్వడం పట్ల అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అయితే వివేక్ ఆత్రేయ మీద అంతులేని నమ్మకమున్న నాని ఈసారి యాక్షన్ కథకు ఓకే చెప్పాడు. తనతో సమాన ప్రాధాన్యం ఉండే విలన్ పాత్రని చూసి మార్పులు అడగలేదు. ఫలితంగా న్యాచురల్ స్టారే గెలిచాడు.
ఇప్పటికీ సామజిక మాధ్యమాల్లో అంటే సుందరానికి మీద రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆదరించాల్సిన స్థాయిలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదని, కొంత ట్రిమ్ చేసినా లేదా కొన్ని మార్పులు చేసినా రిజల్ట్ సూపర్ హిట్ కి తక్కువ ఉండేది కాదన్నది మూవీ లవర్స్ అభిప్రాయం. దాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే నిజముంది కనక.
సున్నితమైన పాయింట్ ని నిడివి పెంచి చెప్పడం వల్లే మిక్స్డ్ టాక్ వచ్చిన వైనం మొదటి రోజే బయట పడినా దాన్ని సరిదిద్దేలోపే నష్టం జరిగిపోయింది. ఇప్పుడు సరిపోదా శనివారంలోనూ లెన్త్ ఇష్యూ ఉన్నా అదేమంత సీరియస్ గా ప్రభావం చూపడం లేదు.
ఈ లెక్కన సుందరం చేసిన గాయం సరిపోదా శనివారంలో సూర్య పూర్తిగా పోగొట్టినట్టే. నాని కన్నా ఎక్కువ సంతోషపడేది వివేక్ ఆత్రేయనే. తాను మాస్ సబ్జెక్టులను హ్యాండిల్ చేయగలనన్న భరోసా ఇతర నిర్మాతలకు ఇచ్చేశాడు. ఒకవేళ ఎవరైనా స్టార్ హీరో కమర్షియల్ కథలు అడిగినా ఇవ్వగలిగే స్థితికి వచ్చాడు.
నాని, ఎస్జె సూర్య ఇద్దరు ఆర్టిస్టుల మీద భారం మోపి స్క్రీన్ ప్లే, ట్విస్టులతో నడిపించిన తీరు ఇతర భాషల్లోనూ ప్రశంసలు దక్కించుకుంటోంది. తమిళనాడులో క్రమంగా వసూళ్లు పెరుగుతున్నాయని అక్కడి ట్రేడ్ టాక్. పోటీ లేకపోవడం చాలా పెద్ద షబసానుకూలాంశం.
This post was last modified on August 30, 2024 10:01 am
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…