ఒక పేరున్న హీరో మాస్ సినిమా కోసం టాలీవుడ్ బాక్సాఫీస్ ఎంతగా తపించిపోతోందో ఇవాళ విడుదలైన సరిపోదా శనివారం రుజువు చేస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద పబ్లిక్ టాక్ బాగుండటంతో దాదాపు అన్ని మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. బుక్ మై షోలో సగటున గంటకు 9 వేల టికెట్లు అది కూడా వీక్ డే అయిన గురువారం అమ్ముడుపోవడం శుభ సంకేతం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సగటు మూవీ లవర్స్ చూడాల్సిన ఎక్స్ పీరియన్స్ గా ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో అదనపు స్క్రీన్లు అవసరమయ్యేలా ఉన్నాయి.
ఫైనల్ స్టేటస్ ఏంటనేది తేలడానికి ఇంకా చాలా టైం పడుతుంది కానీ మొదటి వీకెండ్ మాత్రం పూర్తిగా నాని అదుపులోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా శని ఆదివారాల ఫిగర్స్ పట్ల బయ్యర్లు గట్టి నమ్మకంతో ఉన్నారు. నిజానికి మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు కనీసం యావరేజ్ అనిపించుకున్నా ఓ పది రోజులు సందడి చేసేవి. కానీ మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ రావడం వల్ల మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ సరిపోదా శనివారంకి ఆ రిస్క్ లేదు. హ్యాపీగా చూసేయొచ్చనే మాట బయటికి వచ్చేయడంతో క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.
ఓపెనింగ్ ఎంతనేది రేపు మధ్యాన్నానికి తేలుతుంది కానీ ట్రెండ్ చూస్తుంటే దసరాని దాటడం ఖాయంగా కనిపిస్తోంది. నాని ఎస్జె సూర్య నటన, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినా యునీక్ పాయింట్ హ్యాండిల్ చేసిన విధానం మాస్ కి కనెక్ట్ అవుతోంది. జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. హిట్టా లేక అంతకు మించా అనేది ఇప్పుడే నిర్ణయించలేం కాబట్టి కనీసం ఓ పది రోజులు వేచి చూడాల్సి వస్తుంది. ఏబి సెంటర్స్ అధిక శాతం నిన్న, మొన్న వారం వచ్చిన సినిమాలకు రీ ప్లేస్ మెంట్ గా సరిపోదా శనివారంనే వేయబోతున్నారు. ట్రేడ్ తో సహా అందరూ నెంబర్ల కోసం వెయిటింగ్.
This post was last modified on August 29, 2024 4:47 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…