మిల్కీ బ్యూటీ తమన్నా ప్రియుడు కం కాబోయే భర్త విజయ్ వర్మ ఈ మధ్య ఆర్టిస్టుగా బాగా బిజీ అయ్యాడు. ముఖ్యంగా మంచి వెబ్ సిరీస్ లు ఇతని ఖాతాలో పడుతున్నాయి. అవి అధిక శాతం హిట్టవడంతో గతంలో లేని పేరు ఒక్కసారిగా పెరిగిపోయింది. న్యాచురల్ స్టార్ నాని ఎంసిఏలో విలన్ గా టాలీవుడ్ కు వచ్చిన విజయ్ వర్మ అది పెద్ద హిట్టయినా తర్వాత ఎందుకో ఇక్కడ అవకాశాలు రాలేదు. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ జరుగుతున్న సమయంలో తమన్నాతో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారడం, ఆ తర్వాత ఇద్దరూ తాముగా బంధాన్ని బహిర్గతం చేయడం చకచకా జరిగిపోయాయి.
తమ రిలేషన్ గురించి విజయ్ వర్మ ఇటీవలే మాట్లాడుతూ తమన్నాతో తన రిలేషన్ దాచాలని ఎప్పుడూ అనుకోలేదని, గుట్టుగా ఉంచాలనుకున్నా స్వేచ్ఛ కోరుకునే తనలాంటి వాళ్లకు సాధ్యం కాదని, అందుకే ఓపెన్ గానే అందరికీ తమ బంధాన్ని తెలియజేశామని అన్నాడు. బయట ప్రపంచానికి చెప్పని, షేర్ చేయని ఎన్నో సంగతులు తమ మధ్య ఉన్నాయని, సోషల్ మీడియాలో పంచుకోని 5 వేల ఫోటోల గురించి చెప్పి చిన్న షాక్ ఇచ్చాడు. లవర్స్ కలిసి జ్ఞాపకాలు తీసుకోవడం మాములే కానీ మరీ ఇలా వేలకొద్దీ అంటే మాత్రం ఏ స్థాయిలో ఈ జంట ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్త్రీ 2 ఐటెం సాంగ్ ద్వారా తమన్నా ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ లో భాగం పంచుకోగా నెట్ ఫ్లిక్స్ లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఐసి 814 కాందహార్ అటాక్ ద్వారా విజయ్ వర్మ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టిన ఈ హైజాక్ థ్రిల్లర్ లో అరవింద్ స్వామి, నసీరుద్దీన్ షా లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. పెళ్లి డేట్ మాత్రం విజయ్ వర్మ, తమన్నాలు చెప్పడం లేదు. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని అంటున్నారు. ఏ వేడుకైనా సరే కలిసే వెళ్తున్న ఈ ప్రేమ పావురాలు త్వరలో భార్యాభర్తలు కావడం చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
This post was last modified on August 28, 2024 9:13 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…