టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. 80, 90 దశకంలో ఆయన అగ్ర కథానాయకులకు దీటుగా హిట్లు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ప్రభావం తగ్గుతూ వచ్చింది. గత దశాబ్ద కాలంలో రాజశేఖర్‌కు చెప్పుకోదగ్గ హిట్ అంటే.. ‘గరుడవేగ’ మాత్రమే. చాలా ఏళ్ల తర్వాత ఆ చిత్రంతో ఓ మంచి విజయం సాధించాడు కానీ.. తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
కల్కి, శేఖర్ సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేయడంతో ఆయన కెరీర్లో మళ్లీ గ్యాప్ వచ్చింది. గత ఏడాది ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ చిత్రంలో ప్రత్యేక పాత్రతో రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. అది కూడా డిజాస్టర్ కావడంతో ఏం ప్రయోజనం లేకపోయింది. మళ్లీ విరామం తీసుకున్న రాజశేఖర్.. హీరోగా ఇటీవలే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఆ చిత్రానికి తన కల్ట్ సినిమాల్లో ఒకదాని టైటిల్ వాడుకుంటుండడం విశేషం.
90వ దశకంలో రాజశేఖర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకడిగా నిలిచిన చిత్రం.. మగాడు. ఇప్పుడు ఆ సినిమా టైటిల్‌ను రాజశేఖర్ తన కొత్త చిత్రానికి పెట్టుకుంటున్నాడట. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించి.. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన యువ దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని రూపొందించాడు. చివరగా ఓటీటీ కోసం చేసిన ‘సేనాపతి’ చిత్రంతో పవన్ మెప్పించాడు.
దాని కంటే ముందు ఓ పెద్ద సినిమా చేయాలని ప్రయత్నించి ఫెయిలైన పవన్ సాధినేని.. ప్రస్తుతం రాజశేఖర్‌తో సినిమా చేస్తున్నాడు. దీని కథకు కూడా సూటయ్యేలా ‘మగాడు’ అనే టైటిల్ ఎంచుకున్నారట. ఈ టైటిల్ ప్రకారం చూస్తే ఇది బాగా హీరోయిజం ఉన్న మాస్ సినిమానే అయి ఉండొచ్చు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on August 28, 2024 6:44 pm
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…