Movie News

పుష్ప 3 వెనుక పక్కా వ్యూహం

పుష్ప 1 ది రైజ్, పుష్ప 2 ది రూల్ తర్వాత పుష్ప 3 ది రోర్ ఉంటుందని మా సైట్ ఫిబ్రవరిలోనే ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే విడుదలైన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన రావు రమేష్ మూడో భాగంలోనూ తనకు ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పడంతో అనధికారికంగానే అఫీషియల్ ముద్ర వచ్చినట్టయ్యింది. ఒకవేళ ఇదే నిజమైతే స్టార్ హీరోల్లో మొదటి మూడు భాగాల ప్యాన్ ఇండియా మూవీ చేసిన వాడిగా అల్లు అర్జున్ పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇక వ్యూహం సంగతి చూద్దాం.

పుష్ప 2 డిసెంబర్ లో రిలీజయ్యాక బన్నీకి చాలా గ్యాప్ రానుంది. అట్లీతో ప్రాజెక్టు ఓకే అయ్యిందని పదే పదే లీక్ కావడం తప్పించి నిజంగా ఉంటుందా లేదానే కన్ఫర్మేషన్ దొరకడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. స్పిరిట్, యానిమల్ పూర్తి చేసి 2028 తర్వాత కానీ సందీప్ రెడ్డి వంగా అందుబాటులోకి రాడు. సో అల్లు అర్జున్ కనక పుష్ప 3 సిద్ధంగా ఉంచుకుంటే వచ్చే ఏడాది లేదా ఆ పై సంవత్సరం దాన్ని విడుదల చేయడం ద్వారా గ్యాప్ లేని సంకేతాన్ని అభిమానులకు పంపుకోవచ్చు. ఇది నిజమా కాదాని తెలిసేది కూడా పార్ట్ 2 షో పడ్డాకే.

ఈ లెక్కన దర్శకుడు సుకుమార్ పుష్ప 3 కోసం మరికొంత కాలం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రిలీజ్ డేట్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి పబ్లిసిటీ విషయంలో తొందరపాటు చూపించే ఉద్దేశంలో సుక్కు బృందం లేదు. వస్తున్న బిజినెస్ ఆఫర్లు చూస్తుంటే కల్కి 2898 ఏడి రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతుండగా గత కొద్దిరోజులుగా మెగాభిమానులు వర్సెస్ బన్నీ ఆర్మీ మధ్య జరుగుతున్న ట్రోలింగ్ యుద్ధం ఓపెనింగ్స్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందేమోననే అనుమానం జనంలో లేకపోలేదు. మొత్తానికి పుష్పకి సంబంధించిన పరిణామాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి.

This post was last modified on August 28, 2024 2:13 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

27 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago