ఇంకొద్ది గంటల్లో ప్రీమియర్లు మొదలుకాబోతున్న సరిపోదా శనివారంకు నాని కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వస్తాయనే ధీమాతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సులకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్లో హఠాత్తుగా తీసేయడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మూడు రోజుల క్రితం ఉండేవి కానీ చెప్పా పెట్టకుండా బుక్ మై షో, పేటిఎంతో పాటు వాటి స్వంత యాప్స్ లో లేకపోవడం చూసి కారణం అంతు చిక్కక సతమతమవుతున్నారు. దీని వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతాయని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించమని ప్రేక్షకులు కోరుతున్నారు.
స్పష్టమైన వివరాలు ఇంకా బయటికి రాలేదు ఒకటి రెండు రీజన్స్ కనిపిస్తున్నాయి. పివిఆర్ సంస్థ తక్కువ ధరకు మల్టీప్లెక్స్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పాస్ పోర్ట్ స్కీంలో వేలాది సభ్యులు ఉన్నారు. వాళ్లంతా సోమవారం నుంచి గురువారం వరకు కేవలం తొంభై రూపాయలలోపే బుక్ చేసుకోవచ్చు. సరిపోదా శనివారం చూస్తేనేమో గురువారం రిలీజవుతోంది. నైజామ్ లో రెండు వందల తొంబై అయిదు రూపాయలకు అమ్మాల్సిన టికెట్ ను కేవలం అందులో ముపై శాతానికి అమ్మితే నష్టం కదా. ఇది అధికారికంగా చెప్పలేదు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది.
మరొకటి డిస్ట్రిబ్యూటర్స్ పివిఆర్ మధ్య పర్సెంటేజ్ గురించి ఏదైనా వ్యవహారం కొలిక్కి రానప్పుడు ఇలా జరుగుతుంది. పలువురు నెటిజెన్లు డివివి సంస్థని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తే మీరు సంబరానికి రెడీ అవ్వండి ఇది మేము చూసుకుంటామని హామీ వచ్చింది. తీరా చూస్తే పన్నెండు గంటలు దాటుతున్నా ఎలాంటి అప్డేట్ లేదు. నాని రేయి పగలు తేడా లేకుండా ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతూ ఉంటే ఇలాంటి విషయాలు ఆందోళన రేకెత్తించడం సహజం. ఆఘమేఘాల మీద ఈ ఇష్యూని ముగించేసి అన్ని స్క్రీన్ల బుకింగ్స్ అందుబాటులోకి తేవాలని నాని ఫ్యాన్స్ డిమాండ్.
This post was last modified on August 28, 2024 12:19 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…