Movie News

శివ అభిమానుల కోరిక తీరుతోంది

తెలుగు సినిమాను మలుపు తిప్పిన ఆల్ టైం క్లాసిక్ శివని వెండితెరపై చూడాలని కోరుకుంటున్న మూవీ లవర్స్ లక్షల్లో ఉన్నారు. 1989లో రిలీజైన ఈ కాలేజీ యాక్షన్ బ్లాక్ బస్టర్ గురించి ఎన్ని వేల వ్యాసాలు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. ఇప్పుడంటే గతి తప్పింది కానీ ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే బ్రాండ్ ని బాలీవుడ్ దాకా తీసుకెళ్లింది శివనే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా నుంచే అమలతో నాగార్జున బంధం మరింత బలపడి వివాహం దాకా వెళ్ళింది. ఇళయరాజా సంగీతం, గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం, కొత్త కుర్రాళ్ళ యాక్టింగ్ టాలెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

ఇప్పుడీ శివ 4Kలో రానుంది. నిజానికీ పుట్టినరోజుకి దాన్నే రీ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ప్రింట్ కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో శివ స్థానంలో మాస్ తీసుకొచ్చారు. ఇవాళ థియేటర్లలో సందడి చేస్తున్న మాస్ టైటిల్ కార్డుకి ముందే శివ ట్రైలర్ ద్వారా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. విడుదల తేదీ ఎప్పుడనేది ఇంకా చెప్పలేదు కానీ డిసెంబర్ లో ఉండొచ్చని టాక్. మాస్ ని ఇవాళ పరిమిత షోలతో స్క్రీనింగ్ చేశారు. ఇంద్ర తరహాలో కాకుండా ఉన్నంతలో తక్కువ ఆటలతోనే ఎక్కువ హంగామా ప్లాన్ చేసుకున్నారు అభిమానులు. క్రాస్ రోడ్స్ లో సందడి ఓ రేంజ్లో ఉంది.

ఏదైతేనేం ఒక క్లాసిక్ ని సరికొత్త క్వాలిటీతో చూడటం కొత్త తరం ఆడియన్స్ కి  విభిన్న అనుభూతిని కలిగిస్తుంది. గతంలో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటివి రీ రిలీజ్ చేసినా క్వాలిటీ విషయంలో శ్రద్ధ తీసుకోపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. పాత సినిమాలింతే అని సరిపెట్టుకున్నారు. నిజానికి సరైన రీతిలో వర్క్ చేయిస్తే అద్భుతమైన రెజోల్యూషన్ తో అదరగొట్టొచ్చని ఇటీవలే మలయాళం మూవీ మణిచిత్రతజు (చంద్రముఖి ఒరిజినల్) నిరూపించింది. ఇదే బాటలో శివ, జగదేకవీరుడు అతిలోకసుందరి, భైరవ ద్వీపం, బొబ్బిలి రాజా లాంటివి వస్తే ఫ్యాన్స్ కు పండగే. 

This post was last modified on August 28, 2024 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిన్న తప్పు చేసినా… వీసా కట్!

ఎన్నో కలలు కంటూ అమెరికాకు వెళ్లే భారత విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితులు కలవరపెడుతున్నాయి. అమెరికాలో వీసా నియమాలు కఠినతరం కావడం,…

19 minutes ago

చంద్రబాబు బాటలో సాగుతున్న రేవంత్ రెడ్డి

ప్రజాలకు మెరుగైన పాలనను అందించేందుకు పాలనా సంస్కరణలను రూపొందించి అమలు చేసే విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది…

41 minutes ago

మోదీ సేనలోకి మరో సీనియర్ క్రికెటర్

క్రికెట్ కెరీర్ లు గుడ్ బై చెప్పిన అనంతరం కొందరు ఆటగాళ్లు డైరెక్ట్ గా పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్…

60 minutes ago

ఓదెల 2 – ప్రేతశక్తిని ఎదిరించే దైవభక్తి

మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా ఈసారి పూర్తిగా వేషం మార్చుకుని శివ భక్తురాలిగా చేసిన సినిమా ఓదెల 2. టీజర్…

1 hour ago

లెనిన్ : అభిమానుల ఆకలి తీరింది

https://www.youtube.com/watch?v=w2ZbnBobkuQ ఇతర హీరోల అభిమానులు రీ రీ లాంచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నా తనదైన రోజు అఖిల్ ఒక సాలిడ్…

2 hours ago

ఎక్కి తొక్కేశారు… రోడ్డు బాట పట్టిన జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనకు వచ్చిన…

2 hours ago