దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ అనే విజువల్ వండర్ తీయడానికి బలమైన పునాది వేసిన సినిమా.. ఈగ. ఒక ఈగను లీడ్ రోల్‌లో పెట్టి జక్కన్న చేసిన మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం కూడా పెద్ద బడ్జెట్లు పెడితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను రంజింపజేయవచ్చని.. ప్రేక్షకులు కూడా అలాంటి ప్రయత్నాలను బాగా ఆదరిస్తారని ‘ఈగ’ చాటిచెప్పింది.
ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే జక్కన్న ‘బాహుబలి’ని ఇంకా భారీగా తీయగలిగాడు. ఐతే ‘ఈగ’ సినిమాకు సీక్వెల్ తీయాలని అప్పట్లో అనుకున్నాడు జక్కన్న. కానీ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ‘ఈగ’లో ఓ ముఖ్య పాత్ర పోషించిన నాని.. ఇప్పుడీ సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్లలో భాగంగా ఈగ-2 ప్రస్తావన రాగా.. ఒకవేళ ఆ సీక్వెల్ తీసినా తన అవసరం లేదని రాజమౌళి చెప్పినట్లు నాని వెల్లడించడం విశేషం.
‘‘నేను ఈగ సీక్వెల్ గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడూ అడగలేదు. కానీ రాజమౌళి గారితో మాత్రం ఓసారి సరదాగా చర్చించాను. ఈగ-2 చేస్తానన్నారు కదా, ఎప్పుడు మొదలుపెడదాం అని అడిగాను. దానికాయన.. ‘మేం ఈగ-2 చేసినా నీతో అవసరం లేదు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది’ అని చెప్పారు. ఈగ సినిమా చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.
ఈగ సీక్వెల్ గురించి ఆయనకు ఐడియా వచ్చినపుడు ఆ పనులు మొదలుపెడతారని అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు’’ అని నాని అన్నాడు. ‘ఈగ’లో నాని పాత్రే చనిపోయిన అనంతరం ఈగగా మళ్లీ ప్రాణం పోసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లోనే నాని పాత్ర చనిపోయిన నేపథ్యంలో ఒకవేళ సీక్వెల్ తీసినా నాని అవసరం రాకపోవచ్చు. ఐతే ప్రస్తుతం రాజమౌళి కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఈగ-2 చేసే అవకాశాలు దాదాపు లేనట్లే.
This post was last modified on August 27, 2024 8:23 pm
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…