ఉవ్వెత్తున ఎగసి వరస సినిమాలతో యమా స్పీడ్ తో దూసుకొచ్చిన శ్రీలీలకు వాటి పరాజయాలు గట్టి దెబ్బే వేశాయి. తక్కువ టైంలోనే మహేష్ బాబుతో చేసే ఛాన్స్ వచ్చినా దాని ఫలితం నిరాశ కలిగించింది. చిన్న బ్రేక్ తీసుకుని ఎంబిబిఎస్ పరీక్షలు పూర్తి చేసిన ఈ చలాకి భామకు ఆఫర్లయితే ఆగడం లేదు. వివిధ బాషల నుంచి క్రమం తప్పకుండా దర్శకులు కలుస్తున్నారు.
నితిన్ రాబిన్ హుడ్ మినహాయించి ప్రస్తుతం తన చేతిలో టాలీవుడ్ మూవీ ఏదీ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఎప్పుడు రీ స్టార్ట్ అవుతుందనే దాని మీద ఇంకా క్లారిటీ లేకపోవడంతో కొంత కాలం మినహాయించాలి.
ఇదిలా ఉండగా శ్రీలీలకు మొదటి కోలీవుడ్ అవకాశం తలుపు తట్టినట్టు సమాచారం. ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధా కొంగర పురాననూరుని తీయబోతున్న సంగతి తెలిసిందే. సూర్య హీరోగా తొలుత ఈ ప్రాజెక్ట్ లాకయ్యింది. కానీ ఏవో కారణాల వల్ల తను తప్పుకున్నాడు.
ఇప్పుడిదే మూవీని శివ కార్తికేయన్ తో తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది. స్థానికత గురించి వివాదాస్పద అంశం మీద రూపొందబోయే పురాననూరులో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఇవన్నీ లీకుల రూపంలో వచ్చినవే తప్ప ఖరారుగా ఇంకా అధికారిక ప్రకటన లేదు.
ఒకరకంగా చెప్పాలంటే శ్రీలీలకు ఇది బంపర్ ఛాన్స్. సుధా కొంగర సినిమాల్లో హీరోయిన్ కు నటనపరంగా తగినంత ప్రాధాన్యం ఉంటుంది. అపర్ణ బాలమురళి, రితిక సింగ్ తదితరులు అలా పైకొచ్చిన వాళ్లే. ఈ పురాననూరు సైతం ఆషామాషీ కమర్షియల్ సబ్జెక్టు కాదు. కాంట్రవర్సీ ఉంటుందట.
దశాబ్దాల క్రితం జరిగిన హిందీ బాషా వ్యతిరేక ఉద్యమాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నట్టు టాక్ ఉంది. సో శ్రీలీలకు ఏదో నాలుగు పాటలు, రెండు లవ్ ట్రాక్స్ తరహాలో ఉండదన్నది స్పష్టం. సుధా కొంగరకు ఇటీవలే సర్ఫిరా రూపంలో బాలీవుడ్ ఎంట్రీ దగ్గరే షాక్ కొట్టింది. అందుకే ఆశలన్నీ పురాననూరు మీదే ఉన్నాయి.
This post was last modified on August 27, 2024 10:35 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…