ఇంద్ర రీ రిలీజ్ ఘనవిజయాన్ని పురస్కరించుకుని టీమ్ మొత్తాన్ని ఇంటికి పిలిపించి చిరంజీవి సత్కరించిన వీడియో నిన్న వైజయంతి మూవీస్ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో చాలా విశేషాలున్నాయి కానీ అభిమానులను ప్రధానంగా ఆకట్టుకున్న అంశం ఒకటుంది. అది జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్రకు సీక్వెల్స్ ఉంటాయని వాటికి సంబంధించిన వివరాలు త్వరలో చెబుతానని నిర్మాత అశ్వినిదత్ ప్రకటించడం. ఇది వినగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యానందంతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు. కానీ ప్రాక్టికల్ గా చూడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
ముందు జగదేకవీరుడు అతిలోకసుందరి సంగతి చూస్తే 1990లో రిలీజైన ఈ ఆల్ టైం క్లాసిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మానవుడికి, ఇంద్రుడి కూతురికి మధ్య సృష్టించిన ప్రేమకథ ఆబాలగోపాలాన్ని అలరించింది. అప్పట్లో సీక్వెల్స్ ట్రెండ్ లేదు కాబట్టి ఎవరూ ఆలోచించలేదు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో పార్ట్ 2 వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ దత్ గారి మనసులో ఏముందో ఇంకా తెలియాలి. పైగా ఆ సినిమాలో నటించిన శ్రీదేవి, అమ్రిష్ పూరి, రామిరెడ్డి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్ ఇలా ఎంతో మంది మనమధ్య లేరు.
సో ఫ్రెష్ గా కొత్త స్టోరీ అల్లుకోవాలి. ఇక ఇంద్ర సంగతి చూస్తే ఫ్యాక్షన్ ట్రెండ్ దాదాపు అంతరించిపోయింది. అడపాదడపా వస్తున్నాయి కానీ చాలామటుకు తగ్గిపోయాయి. 2002లో వచ్చిన ఇంద్రకు కొనసాగింపంటే బలమైన కసరత్తు చేయాలి. దీంట్లో చేసిన ఆర్తి అగర్వాల్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు లాంటి వాళ్ళు కాలం చేశారు. రెండింటికి ఇలా సమస్యలు కొన్నున్నాయి. పైగా ఈ సినిమాలకు గొప్ప సంగీతం ఇచ్చిన ఇళయరాజా, మణిశర్మలు ఫామ్ లో లేరు. దర్శకులు రాఘవేంద్రరావు, బి గోపాల్ రిటైరయ్యారు. ఈ ప్రతికూలతలన్నీ దాటుకుని క్లాసిక్స్ కి రెండో భాగం తీసే సవాల్ ని దత్తుగారి ఎలా దాటుతారో.
This post was last modified on August 27, 2024 10:56 am
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…