సరిగ్గా నెల రోజుల్లో దేవర పార్ట్ 1 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌంట్ డౌన్ ముప్పై రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులు ప్రమోషన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ షూటింగ్ అయిపోయింది కాబట్టి దానికి అనుగుణంగానే పబ్లిసిటీ ఎలా ఉండాలనే దాని మీద టీమ్ కసరత్తులు చేస్తోంది.
దర్శకుడు కొరటాల శివ మిగిలిన ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ విదేశాల నుంచి రాగానే రీ రికార్డింగ్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. సెప్టెంబర్ మూడో వారానికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు పంపాలి. లేదంటే చాలా ఒత్తిళ్లు తలెత్తుతాయి.
ఇదిలా ఉండగా దేవర బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం జరిగినట్టు లేటెస్ట్ అప్డేట్. ఓవర్ సీస్ తో పాటు ఇండియాలోనూ ఒకే సమయంలో మొదటి ఆట పడేలా అర్ధరాత్రి ఒంటి గంటకు ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలిసింది.
దీని వల్ల ఓవర్సీస్ రిపోర్ట్స్, ఇక్కడి రివ్యూస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే యుఎస్ టాక్ తీసుకుని సోషల్ మీడియాలో దాన్ని నెగటివ్ గా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఒకరకంగా ఇది తెలివైన స్ట్రాటజీ. అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రీమియర్ చూస్తున్నపుడే అనకాపల్లిలో తారక్ ఫ్యాన్ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఒక రకంగా తెలివైన గేమ్ ఇది.
అలా అని రిస్క్ లేకుండా పోలేదు. తెల్లవారకుండానే పూర్తి టాక్ బయటికి వస్తుంది. పాజిటివ్ అయితే టికెట్లు దొరకడం దుర్లభమే. దీనికి తోడు పగటి పూట షోలలో కోత వేసుకోవాల్సి ఉంటుంది. అనుమతి అయిదు ఆటలకే ఉంటుంది కాబట్టి ఆరో షోకి అనుమతి కోసం ప్రభుత్వాలకు అప్లికేషన్ పెట్టాలి.
టికెట్ పెంపు ఎలాగూ ఉండబోతోంది. అది పది రోజులా లేక రెండు వారాలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లలో ఏ స్టార్ హీరోకి మిడ్ నైట్ ప్రీమియర్లు పడలేదు. ఒకవేళ దేవర కనక దీనికి శ్రీకారం చుడితే రాబోయే పుష్ప 2, గేమ్ ఛేంజర్, విశ్వంభర వగైరాలన్నీ ఇదే రూటు పడతాయి. నో డౌట్.
This post was last modified on August 27, 2024 10:29 am
అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఏఎన్ఆర్ విగ్రహం…
డిసెంబర్ లో పుష్ప 2 సునామి ఉంటుందని తెలిసి కూడా దాని తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ తో…
చెన్నైలో జరిగిన ‘పుష్ప-2’ తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగంతో రాజుకున్న వివాదం సోషల్…
లక్కీ భాస్కర్.. దీపావళి కానుగా ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన సినిమా. దుల్కర్ సల్మాన్కు తెలుగులో మంచి గుర్తింపే ఉన్నా..…
సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో భారతీయ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే,…
‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్ జరిగినపుడల్లా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొన్ని రోజుల కిందట బీహార్లోని పాట్నాలో చేసిన…