టోవినో థామస్ మనకు రెగ్యులర్ థియేటర్ హీరో కాకపోయినా ఓటిటి ద్వారా బాగా సుపరిచితుడు. ముఖ్యంగా మిన్నల్ మురళి తర్వాత తెలుగులో గుర్తింపు మొదలైంది. 2018 ఎవ్రి వన్ ఈజ్ హీరో దాన్ని మరింత పైకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఏఆర్ఎం అనే ప్యాన్ ఇండియా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆరు భాషల్లో సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ ని మైత్రి సంస్థ తెలుగులో పంపిణి చేస్తోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ కాగా మనకు బాగా పరిచయమున్న ఐశ్వర్య రాజేష్ మరో కీలక పాత్ర పోషించింది. ట్రైలర్ ద్వారా కథేంటో ఓపెన్ చేశారు.
అనగనగా పూర్వీకుల కాలం. హరిపురంలో పేరు మోసిన దొంగ మణియన్ (టోవినో థామస్) వల్ల కంటి మీద కునుకు లేక ఊరి జనం అల్లాడిపోతుంటారు. ఎంతటి యోధుడినైనా మట్టి కురిపించే అతని కండబలం ముందు ఎవరైనా ఒడిపోవాల్సిందే. అదే పోలికల్లో ఉండే కొడుకు అజయన్ కూడా ఇదే తరహా నేపధ్యం ఉంటుంది. కట్ చేస్తే వర్తమానంలో మనవడు కుంజికెలు (టోవినో థామస్) తమ వంశంకున్న మచ్చ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. దొంగ కాకపోయినా ఆ ముద్ర మోయాల్సి వస్తుంది. ప్రియురాలు (కృతి శెట్టి) సైతం చిక్కుల్లో పడుతుంది. ఈ చిక్కుముడే అసలు కథ
విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. టోవినో థామస్ దీనికోసం చాలా కష్టపడ్డాడు. ఇతర భాషల్లో మార్కెట్ తెస్తుందనే నమ్మకంతో భారీ ప్రమోషన్లకు ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం మల్లువుడ్ టీమే పనిచేసినప్పటికీ టెక్నికల్ వేల్యూస్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కృతి శెట్టికి ఒకరకంగా ఇది బంపర్ ఆఫరనే చెప్పాలి. తెలుగులో వరస డిజాస్టర్లతో మార్కెట్ బాగా పడిపోయిన టైంలో ఈ ఏఆర్ఎం వస్తోంది. వినాయకచవితి పండగ తర్వాత వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా మీద అంచనాలు రేగేలా ట్రైలర్ కట్ చేశారు. బడ్జెట్ వంద కోట్లకు పైగానే అయ్యిందట. జితిన్ లాల్ దర్శకుడు.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…