కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా పరిచయం అయిన సినిమా.. మత్తు వదలరా. ఇది టాలీవుడ్లో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోయింది. ఒక మూసలో సాగే థ్రిల్లర్ మూవీస్‌కు భిన్నంగా.. సరికొత్త కాన్సెప్ట్‌తో హాలీవుడ్ శైలిలో ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అరంగేట్రంలోనే ఇలాంటి మంచి థ్రిల్లర్‌తో మెప్పించాడు రితీష్ రాణా.
ఇదే సినిమాతో సింహానే కాక నరేష్ అగస్త్య అనే మరో టాలెంటెడ్ నటుడు కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఐతే ఈ చిత్రం తర్వాత తనపై పెరిగిన అంచనాలను రితీష్ అందుకోలేకపోయాడు. తన రెండో సినిమా ‘హ్యాపీ బర్త్ డే’ నిరాశపరిచింది. దీంతో తర్వాత తన పేరు వినిపించలేదు. ఐతే కొంచెం గ్యాప్ తీసుకుని అతను తన అరంగేట్ర చిత్రానికి సీక్వెెల్ తీస్తున్నాడు. దీని గురించి ఈ రోజే సమాచారం బయటికి వచ్చింది.
‘మత్తు వదలరా’ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలే ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశాయి. దీని ప్రి లుక్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. దొంగతనం కాదు, తస్కరించుట అంటూ తాము చేసే పనికి సంస్కారవంతమైన పేరు పెట్టుకుని వస్తున్నారు ‘మత్తు వదలరా’ జోడీ సింహా-సత్య.
వీళ్లు ప్రొఫెషనల్ దొంగలుగా సెలక్ట్ అయిన విషయాన్ని ప్రి లుక్‌లో చూపించారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి ఏమీ వెల్లడించలేదు కానీ.. ‘మత్తు వదలరా’కు పని చేసిన వాళ్లే చాలామంది ఇందులోనూ భాగమై ఉంటారని భావించవచ్చు.
రెండో సినిమాతో దెబ్బ తిన్న రితీష్ రాణా ఈసారి కసితో పని చేస్తాడనడంలో సందేహం లేదు. ‘మత్తు వదలరా’ తర్వాత సింహా సైతం వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేదు. చివరగా ‘ఉస్తాద్’తో అతను ఎదురు దెబ్బ తిన్నాడు. అతడికి మళ్లీ ఈ సీక్వెల్‌తో సక్సెస్ వస్తుందేమో చూడాలి.
This post was last modified on August 26, 2024 6:46 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…