Movie News

నా సినిమాలు నాకే నచ్చలేదు – నారా రోహిత్

ఒకప్పుడు టాలీవుడ్లో బిజీయెస్ట్ యంగ్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు నారా రోహిత్. తన సినిమాలు తొమ్మిది ఒకే సమయంలో వివిధ దశల్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి నటుడు నాలుగైదేళ్ల పాటు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు.

ఇక తన కెరీర్ ముగిసిందని అనుకుంటున్న సమయంలో ‘ప్రతినిధి-2’ ద్వారా ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ‘సుందరకాండ’ అనే కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు నారా రోహిత్. ఈ సినిమా టీజర్ సోమవారమే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మీడియాను కలిసిన రోహిత్ తన కెరీర్లో గ్యాప్ రావడానికి కారణమేంటో వివరించాడు. ‘‘2017, 2018లో నేను చేసిన సినిమాలు చూసుకుంటే నాకే నచ్చలేదు.

ఆ టైంలో కమర్షియల్‌గా ప్రయత్నిద్దామని ప్రయత్నించి ఫెయిలయ్యాను. ఐతే నా సినిమాలు అందరికీ నచ్చడానికి నేనేమీ దేవుడిని కాదు. మామూలు వ్యక్తిని. జీవితం మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. అందుకే తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది’’ అని రోహిత్ తెలిపాడు.

‘ప్రతినిధి-2’ ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపిందా అని రోహిత్‌ను అడిగితే.. తనకా విషయం తెలియదని. దానికి, ఎన్నికలకు సంబంధం లేదని చెప్పాడు. ప్రజలకు అన్నీ తెలుసని.. సినిమాల ద్వారా ప్రభావితం అవుతారని తాను అనుకోనని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ప్రతినిధి-3 చేస్తారా అని అడిగితే.. ప్రతినిధి-2 ఫలితం చూసే ఈ మాట అడుగుతున్నారా అని ప్రశ్నించడం ద్వారా ఆ సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఈ ఫ్రాంఛైజీలో ఇంకో సినిమా ఉండదని చెప్పకనే చెప్పేశాడు రోహిత్.

భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పదవి చేపడతారా అని రోహిత్‌ను ప్రశ్నిస్తే.. దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, అన్నింటికీ కాలమే సమాధానం ఇస్తుందని వేదాంత ధోరణిలో సమాధానమిచ్చాడు రోహిత్. పెళ్లి కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చని.. కానీ వాటికంటే ‘సుందరకాండ’ భిన్నంగా ఉంటుందని, ఈ కథలో హీరోకు జరిగినట్లు నిజ జీవితంలో జరిగితే గుండె ఆగిపోతుందని.. కానీ సినిమాలో అది వినోదాత్మకంగా ఉంటుందని రోహిత్ తెలిపాడు.

This post was last modified on August 26, 2024 6:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

57 minutes ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

2 hours ago

శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?

​టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…

2 hours ago

శర్వా సహకరించకపోవడమా?

శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…

4 hours ago

అమరన్ హీరోకి మిగలని ఆనందం

మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…

4 hours ago

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…

5 hours ago