టాలీవుడ్లో వేగంగా ఎదుగుతున్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఒకప్పుడు చిన్న హీరోగా ఉండి.. తర్వాత మిడ్ రేంజికి ఎదిగిన అతను.. ఇప్పుడు ఆ లీగ్‌కు అందకుండా వెళ్లిపోయేలా కనిపిస్తున్నాడు. గత ఏడాది ‘దసరా’తో ఒక మెట్టు పైకెదిగిన నాని.. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో ఇంకా పైకి వెళ్లేలా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాకు ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో బంపర్ క్రేజ్ వచ్చింది. నాని కెరీర్లోనే అత్యధిక స్థాయిలో ఈ చిత్రానికి బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే.. భారీ ఓపెనింగ్స్ రానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. యుఎస్‌లో నిలకడగా రేంజ్ పెంచుకుంటూ పోతున్న నాని.. ‘సరిపోదా శనివారం’తో తన కెరీర్ హైయెస్గ్ గ్రాసర్ రికార్డును ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు.
యుఎస్‌లో మిలియన్ డాలర్ వసూళ్లను అలవోకగా సాధించే హీరోల్లో ఒకడిగా నాని ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించాడు. ‘సరిపోదా శనివారం’ ప్రి సేల్స్ ఊపు చూస్తుంటే.. 2 మిలియన్ డాలర్ల వసూళ్లు కూడా అతడికి కేక్ వాకేనా అన్న చర్చ జరుగుతోంది.
విడుదలకు మూడు రోజుల ముందే ఈ చిత్రం 2 లక్షల డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఈ ఊపు చూస్తుంటే ప్రిమియర్స్‌తోనే హాఫ్ మిలియన్ క్లబ్‌లో అడుగు పెట్టేలా ఉందీ చిత్రం. సినిమా గురువారమే రిలీజవుతున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కానుంది.
సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. వీకెండ్ అయ్యేలోపే సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో అడుగు పెట్టేయొచ్చు. లాంగ్ రన్ ఉన్న సినిమా అయితే 3 మిలియన్ డాలర్లూ సాధ్యమే అనుకోవచ్చు. ఓవరాల్‌గా వంద కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును కూడా ‘సరిపోదా శనివారం’ ఈజీగానే అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
This post was last modified on August 26, 2024 6:06 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…