యూత్ ఫుల్ కంటెంట్ ఉంటేనో లేదా ఇమేజ్ ఉన్న హీరో అయితేనో తప్ప తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలకు జనాన్ని థియేటర్ కు రప్పించడం కష్టం. అలాంటిది రావు రమేష్ ని టైటిల్ రోల్ లో పెట్టి చేయడమంటే సాహసమే. ఎంత సుకుమార్ భార్య తబిత నిర్మాతగా వ్యవహరించినా సరే ప్రేక్షకులు గుడ్డిగా టికెట్లు కొనరుగా. అందుకే అల్లు అర్జున్ ని తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. స్నేహితుల గురించి తన స్పీచ్ లో చెప్పిన తీరు వేరే అర్థంలోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదైతేనేం మొత్తానికి జనం దృష్టిలో పడేందుకు ఇదంతా బాగా ఉపయోగపడింది.
కట్ చేస్తే మారుతీనగర్ సుబ్రహ్మణ్యంకు వీకెండ్ లో డీసెంట్ ఆక్యుపెన్సిలు దక్కాయి. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో 8 వేలకు దగ్గరగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. ఇందులో సగం కూడా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ నమోదు చేయలేకపోయాయి. కమిటీ కుర్రాళ్ళు, ఆయ్ లు తమ జోరుని కొనసాగించి పదివేలకు పైగా నెంబర్ చూపించాయి. కరెంట్ బుకింగ్స్ లెక్కలు వేరుగా ఉంటాయి కాబట్టి మంచి నెంబర్లు ఆశించవచ్చు. రావు రమేష్ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా డీసెంట్ రెస్పాన్స్ తో జనాన్ని రప్పించింది.
అజయ్ ఘోష్ లాంటి ఆర్టిస్టులు మ్యూజిక్ షాప్ మూర్తిలాంటివి చేసినా ఫలితం దక్కలేదు కానీ రావు రమేష్ ఈ మాత్రం సాధించడం గొప్ప ఫీటేనని చెప్పాలి. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నప్పటికీ జనాలకు పెద్దగా ఆప్షన్లు లేకపోవడంతో థియేటర్ ఎంటర్ టైన్మెంట్ కోసం మారుతీనగర్ సుబ్రహ్మణ్యంని ఆశ్రయించారు. ప్రధాన కేంద్రాల్లో పర్వాలేదు కానీ చాలా మటుకు బిసి సెంటర్స్ లో మాత్రం దీని జోరు తక్కువగానే ఉంది. ఇంకో నాలుగు రోజుల్లో సరిపోదా శనివారం రాబోతున్న నేపథ్యంలో వీలైనంత ఆ లోగానే రాబట్టుకోవాలి.
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…