స్వంత అభిమానిని హత్య చేయించిన కేసులో జైలులో విచారణ ఎదురుకుంటున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ అక్కడ సకల భోగాలు అనుభవిస్తున్నట్టు వచ్చిన లీక్ ఫోటో పెద్ద దుమారం రేపింది. స్నేహితులతో కలిసి ఏదో స్వంత ఇంటి లాన్లో కూర్చున్నట్టుగా సిగరెట్ తాగుతున్న దర్శన్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. సినిమాల్లో హంతకులకు రాచ మర్యాదలు చేయడం చూస్తుంటాం కానీ ఇలా రియల్ లైఫ్ లో నిజం కావడం చూసి అవాక్కవ్వని వాళ్ళు లేరు. ఎవరో రహస్య కెమెరాతో షూట్ చేసి సోషల్ మీడియాలో వదలడంతో ఒక్కసారిగా డిపార్ట్ మెంట్ కలకలం రేగింది.
దీంతో మేల్కొన్న కర్ణాటక ప్రభుత్వం ఏడుగురు జైలు అధికారులను సస్పెన్స్ చేసినట్టు బెంగళూరు రిపోర్ట్. డ్యూటీలో నిర్లక్ష్యంతో పాటు తీవ్ర నేరారోపణలో ఉన్న నిందితుడికి ఇలాంటి మర్యాదలు చేయడం పట్ల వివరణ కోరినట్టు సమాచారం. అయితే ఇలాంటి ఉదంతాలు కొత్తేమి కాదు. గతంలో పలువురు రాజకీయ నాయకులు, హీరోలు జైలుకు వెళ్ళినప్పుడు వాళ్లకు దక్కే రాయల్ ట్రీట్ మెంట్ గురించి ఎన్నో చూశాం. దర్శన్ దీ వాళ్లలో ఒకటి. దీని పట్ల మానవ హక్కుల సంఘాలు తీవ్ర నిరశన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకో ట్విస్టు ఏంటంటే దర్శన్ ఏకంగా జైలు నుంచే వీడియో కాల్స్ చేశాడట.
ఆ ఫోటోలో ఉన్న వేరే వ్యక్తుల్లో ఒకడు విల్సన్ గార్డెన్ నాగ అలియాస్ నాగరాజ్ అనే గ్యాంగ్ స్టార్ గా చెబుతున్నారు. బెంగళూరులో ఉండే ఈ పరప్పన ఆగ్రహార ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. తమిళనాడు మాజీ సిఎం జయలలిత స్నేహితురాలు శశికళలు సకల భోగాలు కల్పించినట్టు అప్పట్లో కాంట్రావర్సీ రేగింది. ఇప్పుడు దర్శన్ వల్ల మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి లాడ్జింగ్ బోర్డింగ్ ఉండాలే కానీ ఎన్ని హత్యలు చేసినా ఏముందనేలా నెటిజెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…