ఇన్నాళ్లు మెగా అభిమానుల మధ్యే అంతరాలు ఉన్నాయని అనుకునేవాళ్లం. బయట ఫ్యాన్స్‌లో అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా.. ఫ్యామిలీలో అందరూ కలిసే ఉన్నారనే అభిప్రాయమే ఉండేది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలతో కుటుంబంలోనూ అగాథం ఏర్పడిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీలో లుకలుకలు మొదలయ్యాయన్నది ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్లు చెబుతున్న మాట. ఆ టైంలో పరోక్షంగా బన్నీని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ఒక ట్వీట్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే.
ఆ తర్వాత అంతకంతకూ బన్నీకి, మిగతా మెగా ఫ్యామిలీలోని హీరోలకు తెలియకుండానే దూరం పెరుగుతూ పోయినట్లు తెలుస్తోంది. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
బన్నీకి, మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరోలు కొందరికి దూరం ఎంత పెరిగిందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురూ రామోజీ ఫిలిం సిటీలో చాలా దగ్గర దగ్గరగానే షూటింగ్‌లో పాల్గొంటున్నప్పటికీ కలవలేదట.
బన్నీ సినిమా ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న సమీపంలోనే వేరే ఫ్లోర్లలో తేజు, వరుణ్ సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కానీ తేజు, వరుణ్ ఒకరినొకరు కలుస్తున్నప్పటికీ.. వాళ్లిద్దరూ బన్నీ దగ్గరికి మాత్రం రాలేదట. ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న విషయం తెలిసీ వాళ్లు తన దగ్గరికి రాలేదట.
అలాగే బన్నీ సైతం వెళ్లి వాళ్లిద్దరినీ కలవలేదట. ఇది మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ అగాథానికి సంకేతమని.. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఫ్యామిలీలోని హీరోలే ఇలా ఉన్నప్పుడు.. అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడడంలో ఆశ్చర్యం లేదని ఈ విషయం తెలిసిన వాళ్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on August 27, 2024 10:27 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…