సోనూ సూద్.. సోనూ సూద్.. కరోనా ఇండియా మీద దాడి మొదలుపెట్టాక గత ఆరేడు నెలల్లో ఇండియాలో అత్యంత చర్చనీయాంశమైన పేరిది. తెర మీద వేసేవన్నీ విలన్ వేషాలు కానీ.. నిజ జీవితంలో మాత్రం చాలా మంచి పనులు చేసి గొప్ప పేరు సంపాదించాడీ బాలీవుడ్ నటుడు. వలస కార్మికులతో మొదలుపెట్టి ఎంతోమందికి సాయం చేసిన సోనూను ఇప్పుడెవరూ ‘విలన్’ లాగా చూడట్లేదు. ఇకపై అతణ్ని హీరో లేదా ఇంకేదైనా పాజిటివ్ పాత్రలోనే చూడాలనుకుంటున్నారు.
ఐతే ఇకముందు ఒప్పుకోబోయే సినిమాల్లో ఆ దిశగా ఆలోచించొచ్చేమో కానీ.. ఇప్పటికే కమిటైన సినిమాల విషయంలో ఆ ఛాన్స్ లేదు. అతను ఒక తెలుగు సినిమాతో పాటు వేర్వేరు భాషల్లో మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. అవి మధ్యలో ఉన్నాయి. తెలుగులో అతను నటిస్తున్న చిత్రం.. అల్లుడు అదుర్స్.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో సోనూ కొంచెం కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రకు సంబంధించి ఇప్పటికే కొంత చిత్రీకరణ జరగ్గా.. మిగతా పార్ట్ షూటింగ్ కోసం ఇంకో వారంలో హైదరాబాద్ రానున్నాడట సోనూ. ఇప్పటికే ‘అల్లుడు అదుర్స్’ చిత్రీకరణ కొన్ని రోజుల కిందటే పున:ప్రారంభం అయింది. ప్రధాన తారాగణమంతా షూటింగ్‌లో పాల్గొంటోంది. సోనూ వచ్చాక అతడితో శ్రీనివాస్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాడట.
ఇంతకుముందు సోనూనూ ఈ చిత్ర బృందం ఎలా చూసేదో కానీ.. కరోనా టైంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సోనూను ట్రీట్ చేసే పద్ధతే వేరుగా ఉండొచ్చు. ఈ సినిమాకు కూడా అతను ప్రత్యేక ఆకర్షణ అవుతాడనడంలో సందేహం లేదు. ఇంతకుముందు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన ‘కందిరీగ’లో సోనూ పాత్రకు మంచి పేరొచ్చింది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ చివరి సినిమా ‘సీత’ సరిగా ఆడకున్నా, అందులోనూ సోనూ పాత్ర ఆకట్టుకుంది. ఇప్పుడా దర్శకుడు, ఈ హీరోతో కలిసి సినిమా చేస్తున్నాడు సోనూ.
This post was last modified on September 28, 2020 4:48 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…