తెలుగులో మంచి అభిరుచితో, తెలుగుదనం ఉట్టిపడేలా సినిమాలు తీసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. తొలి చిత్రం గ్రహణం నుంచి ఆయన ప్రయాణం వైవిధ్యంగానే సాగుతోంది. కమర్షియల్ సక్సెస్‌లు తక్కువైనప్పటికీ.. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్నేళ్ల ముందు సమ్మోహనం సినిమాతో అబ్బురపరిచిన ఇంద్రగంటి.. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
ఆయన చివరి సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫ్లాప్ అయింది. ఈసారి ఆయన కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శిని లీడ్ రోల్‌లో పెట్టి ఓ సినిమాను కొన్ని నెలల ముందు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సమ్మోహనం సినిమాను నిర్మించిన శివలెంక ప్రసాదే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రియదర్శి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఎప్పట్లాగే తెలుగుదనం ఉన్న ఆహ్లాదకరమైన టైటిల్ పెట్టాడు ఇంద్రగంటి ఈ చిత్రానికి.
సారంగపాణి జాతకం.. ఇదీ ప్రియదర్శి-ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతున్న కొత్త చిత్రం పేరు. టైటిల్‌కు తగ్గట్లే ఫస్ట్ లుక్‌లో భూతద్దంలో హస్తరేఖలు చూసుకుంటూ హుషారుగా కనిపించాడు ప్రియదర్శి. టైటిల్, ఫస్ట్ లుక్, మొత్తంగా పోస్టర్ డిజైనింగ్ మంచి ఫీల్ ఇచ్చేలా ఉన్నాయి. ఇంద్రగంటికి ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం. ఒక టైంలో నాని లాంటి మిడ్ రేంజ్ స్టార్‌తో వరుసగా సినిమాలు చేసిన ఇంద్రగంటి.. తర్వాత సినిమా సినిమాకూ రేంజ్ తగ్గించుకోవాల్సి వస్తోంది.
ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ మిడ్ రేంజ్ స్టార్లు ఆయనకు దొరుకుతారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి చిత్రాల్లో నటించిన కూచిపూడి డ్యాన్సర్ రూప కొడయూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇంద్రగంటి ఆస్థాన సంగీత దర్శకుడు వివేక్ సాగర్, సినిమాటోగ్రాఫర్ పీజీ విందా ఈ చిత్రానికి కూడాపని చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సారంగపాణి జాతకం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on August 26, 2024 1:49 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…