ఎన్టీఆర్ బావమరిది.. మంచి ప్లానింగే

టాలీవుడ్లో ప్రస్తుతం వారసుల లిస్ట్ తీస్తే 89-90 శాతం వాళ్లే ఉంటారు. ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు అన్ని క్రాఫ్ట్‌లక చెందిన వాళ్ల పిల్లలు హీరోలైపోతున్నారు. అలాగే హీరోల బంధువులు సైతం కథానాయకులుగా అరంగేట్రం చేస్తున్నారు. ఐతే ఇలా వస్తున్న వాళ్లు అందరూ ఏమీ సక్సెస్ అయిపోవడం లేదు. తమ బ్యాగ్రౌండ్ లాంచింగ్ వరకే కొంతమేర ఉపయోగపడుతోంది. సొంత టాలెంట్, జడ్జిమెంట్‌తోనే ఎవ్వరైనా నిలబడాల్సి ఉంటుంది.

టాలెంట్ విషయంలో అంత గొప్ప పేరు తెచ్చుకోలేదు కానీ.. సినిమాలు, పాత్రల ఎంపిక.. అలాగే నడవడిక విషయంలో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మాత్రం ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ కుర్రాడు ‘మ్యాడ్’ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తన కొత్త చిత్రం ‘ఆయ్’ సైతం ఘనవిజయం సాధించింది.

ఐతే ఈ రెండు చిత్రాల్లో నార్నె నితిన్‌ను ప్రెజెంట్ చేసిన తీరు ప్రత్యేకం. ఏ కొంచెం బ్యాగ్రౌండ్ ఉన్నా సరే.. ఆ హీరోకు విపరీతమైన బిల్డప్ ఇస్తుంటారు సినిమాల్లో. ముఖ్యంగా కొత్తగా వచ్చే వారసులు ప్రేక్షకుల దృష్టిలో పడాలని మిగతా పాత్రల్ని డౌన్ చేసి వీళ్లకే ఎలివేషన్ ఇస్తుంటారు. ఇంట్రో ఫైట్.. సాంగ్.. డ్యాన్సులు, ఫైట్లు ఎక్కువగా పెట్టడం.. పంచ్ డైలాగులు వేయించడం.. ఇలా అరంగేట్ర హీరోల విషయంలో ప్లానింగ్ వేరుగా ఉంటుంది. కానీ ఇదంతా ఔట్ డేట్ అయిపోయిన ఓల్డ్ స్టైల్. నార్నె నితిన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘మ్యాడ్’లో అయినా.. ‘ఆయ్’లో అయినా అతను హీరోలా కనిపించడు.

మిగతా ప్రధాన పాత్రల్లో ఒకటిలా తనదీ ఉంటుంది. తనను ప్రత్యేకం ఎలివేట్ చేయడానికి ప్రయత్నించలేదు. బిల్డప్ లేదు. సింపుల్‌గా కనిపించడం ద్వారా ప్రేక్షకుల మెప్పు పొందగలిగాడతను. అలాగే ఎన్టీఆర్‌ను తీసుకొచ్చి తనను ప్రమోట్ చేయించుకోలేదు నితిన్. అసలు ఇప్పటిదాకా తన సినిమాల ఈవెంట్లు వేటికీ తారక్ రాలేదు. మొత్తంగా ప్రమోషన్లు, పాత్రల పరంగా లో ప్రొఫైల్‌ మెయింటైన్ చేస్తూ కంటెంట్‌తోనే ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు నితిన్. నటుడిగా కొన్ని బలహీనతలున్నా కానీ.. స్క్రిప్ట్ సెలక్షన్, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ద్వారా ప్రేక్షకుల్లో తన పట్ల సానుకూల అభిప్రాయం కలిగేలా చేసుకున్న నితిన్.. ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకునేలా కనిపిస్తున్నాడు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

లక్కీ భాస్కర్.. సాధించాడహో

ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…

2 hours ago

రుషికొండ ప్యాలెస్ జగన్ రాజకీయ సమాధి: రఘురామ

500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…

3 hours ago

వైసీపీ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…

3 hours ago

లోకేష్ స్పీచ్‌కు లైకులు ప‌డుతున్నాయ్‌.. !

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్ర‌సంగాల‌కు మంచి లైకులు ప‌డు తున్నాయి. ఇది ఏదో…

3 hours ago

పుష్ప-2లో షాడో విలన్

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…

4 hours ago

విశ్వక్‌కు అప్పుడు నో చెప్పిన హీరోయినే..

ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…

6 hours ago