‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ అనౌన్స్ చేసిన సినిమా విషయంలో అప్పుడు మెగా అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ అయ్యారు. అందుక్కారణం.. ఆ చిత్రానికి దర్శకుడు శంకర్ కావడమే. చిరంజీవి సహా ఎంతోమంది టాలీవుడ్ టాప్ స్టార్లు శంకర్‌తో పని చేయాలని ఆశపడి ఆ కోరిక నెరవేర్చుకోలేకపోయారు.
అలాంటి అరుదైన అవకాశం చరణ్‌కు దక్కిందని అభిమానులు సంతోషించారు. ఈ చిత్రం మొదలయ్యే సమయానికి శంకర్ పరిస్థితి బాగానే ఉంది. ‘2.0’ అంచనాలను అందుకోలేకపోయినా.. అది తీసిపడేయదగ్గ సినిమా ఏమీ కాదు. భారీ వసూళ్లూ రాబట్టింది.
చరణ్‌తో శంకర్ తన స్థాయిలో ఒక బ్లాక్‌బస్టర్ ఇస్తాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడి మొదలైన నాలుగేళ్లకు కూడా రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్రిస్మస్‌కు రిలీజ్ అని ప్రకటన చేశాక జరిగిన పరిణామాలు అభిమానుల్లో ఇంకా టెన్షన్ పెంచాయి.
ఇటీవలే శంకర్ కొత్త చిత్రం ‘ఇండియన్-2’ రిలీజై దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో ‘గేమ్ చేంజర్’ మీద భయాలు నెలకొన్నాయి. శంకర్ పని తీరు మీద వారికి సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ‘గేమ్ చేంజర్’ రీషూట్ అంటూ వార్తలు మొదలయ్యాయి. ‘ఇండియన్-2’ తర్వాత శంకర్‌లో భయం మొదలైందో, లేక జాగ్రత్త పడుతున్నాడో కానీ.. కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తికరంగా లేరని.. మళ్లీ వాటిని చిత్రీకరించాలని భావిస్తున్నారని.. రిలీజ్ తర్వాత చింతించడం కంటే ముందే తప్పులు దిద్దుకోవడం మంచిదని భావిస్తున్నారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
చరణ్ ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి చేసి బుచ్చిబాబు సినిమాకు ప్రిపేరవుతున్నాడు. కానీ కొన్ని రోజులు మళ్లీ డేట్లు కావాాలని నిర్మాత దిల్ రాజు ద్వారా శంకర్ ప్రపోజల్ పెట్టాడట. అనుకున్న ప్రకారమే క్రిస్మస్‌కు సినిమాను రిలీజ్ చేద్దామని.. కానీ కొన్ని సీన్లు మాత్రం రీషూట్ చేద్దామని శంకర్ అంటున్నాడట. దీనిపై చరణ్, రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఐతే రీషూట్లను నెగెటివ్ విషయంగా చూడాల్సిన అవసరమేమీ లేదు. దీని వల్ల సినిమా మెరుగు పడితే అంతకంటే ఏకావాలి?
దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…