అంటే సుందరానికి అంచనాలు అందుకోవడంలో విఫలమవ్వడానికి అప్పట్లో ప్రధానంగా వినిపించిన కంప్లయింట్ నిడివి. ఒక కులాంతర ఎమోషనల్ ప్రేమకథకు మూడు గంటలకి దగ్గరగా నిడివిని పెట్టడం పట్ల ఎన్ని కామెంట్లు వచ్చినా దర్శకుడు వివేక్ ఆత్రేయ వెనక్కు తగ్గలేదు. మీడియా ప్రతినిధులు అడిగితే రాజీ పడే సమస్యే లేదన్నాడు. ఇప్పుడు ఇదే కాంబోలో సరిపోదా శనివారం వస్తోంది. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్నఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సైతం 2 గంటల 50 నిమిషాలతో సెన్సార్ వెర్షన్ లాక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దీనికి సంబంధించిన వెరైటీ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఒకటి మాత్రం నిజం. లెన్త్ అనేది జానర్ తో ముడిపడిన విషయం. యానిమల్ 3 గంటల 21 నిముషాలు ఉన్నా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆర్ఆర్ఆర్, కల్కి, మహానటి, రంగస్థలం తదితర బ్లాక్ బస్టర్లన్నీ నిడివి పట్టించుకోకుండా జనం ఆదరించినవే. సో సరిపోదా శనివారంకు ఇదేమీ సమస్య కాబోదు. యూనిట్ చెబుతున్న టాక్ ప్రకారం సుందరంలో ఏదైతే పొరపాటు అనుకుంటున్నామో ఇప్పుడదే అడ్వాంటేజ్ అవుతుందని, అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కలిగిస్తుందని అంటున్నారు.
ఇది కనక నిజమైతే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంటుంది. పోటీ లేకుండా సోలోగా బరిలో దిగుతున్న సరిపోదా శనివారం బాక్సాఫీస్ కు ఊపు ఇవ్వాలని బయ్యర్లతో పాటు సగటు మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. ఈ నెలలో సక్సెస్ ఫుల్ మూవీస్ గా ఋజువు చేసుకున్న కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ లు ఎంత విజయవంతమైనా మాస్ ఆకలిని తీర్చినవి కాదు. అందుకే ఇంద్ర రీ రిలీజ్ కు అంత బ్రహ్మాండమైన ఆదరణ దక్కింది. సో నానికి ఇది మంచి సమయం. సరిగ్గా కనెక్ట్ అయితే మాత్రం కనీసం రెండు వారాల పాటు నాన్ స్టాప్ కలెక్షన్లతో కుమ్మేయొచ్చు. ఇంకో ఆరు రోజులే మిగిలింది.
This post was last modified on August 24, 2024 1:32 pm
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్‌ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…