చిలసౌతో హీరోయిన్ గా పరిచయమై డెబ్యూతోనే మంచి మార్కులు తెచ్చుకున్న రుహాని శర్మ రెగ్యులర్ గా సినిమాలు చేస్తోంది కానీ ఆశించిన బ్రేక్ దక్కడం లేదు. హర్ లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్స్ చేసినా ప్రయోజనం శూన్యం. కానీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఆమె గురించిన హాట్ టాపిక్ ఆగ్రా అనే చిత్రం. 2023లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు నోచుకుని ఎన్నో చిత్రోత్సవాల్లో భాగం పంచుకున్న ఆగ్రా ఇప్పటిదాకా థియేటర్ రిలీజ్ జరుపుకోలేదు. ఏడాది గడుస్తున్నా నిర్మాతలు ఆ దిశగా చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ఈలోగా కొన్ని షాకింగ్ ట్విస్టులు జరిగిపోయాయి.
హఠాత్తుగా ఆగ్రా ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది. రుహని శర్మ ఇందులో బోల్డ్ సన్నివేశాలు చేసింది. కేవలం వాటిని మాత్రమే తీసుకుని ఆ వీడియోలను సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరలయ్యాయి. రుహని ఇలాంటి మూవీ చేసిందానే కామెంట్లు తప్పించి నిజానికి అందులో కంటెంట్ ఏముందో తెలియకుండానే విమర్శలు చేసిన వాళ్ళున్నారు. కను భేల్ దర్శకత్వం వహించిన ఆగ్రా ఒక యువకుడి మానసిక స్థితి, లైంగిక ఆలోచనల చుట్టూ నడుస్తుంది. మాలా పాత్ర పోషించిన రుహానీకి హాట్ సీన్స్ పడటం వల్ల కేవలం దాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారు.
ఇది దూరం వెళ్లడం గుర్తించిన రుహని శర్మ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సినిమాని ఇలాంటి ప్రచారంలోకి తీసుకురావడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేస్తూ, కేవలం కొన్ని సన్నివేశాల ఆధారంగా తనను జడ్జ్ చేయడం బాధ కలిగించిందని, తీసుకున్న నిర్ణయం పట్ల స్థిరంగా ఉన్నానని, ఎలాంటి కుదుపులైనా తట్టుకుంటానని చెబుతూ ఒక సుదీర్ఘమైన మెసేజ్ ని పోస్ట్ చేసింది. వీటికి వీలైనంత త్వరగా చెక్ పడాలంటే ఆగ్రాని రిలీజ్ చేయాలి. బుసాన్, మామీ, మెల్బోర్న్ తదితర ఫిలిం ఫెస్టివల్స్ లో ఆగ్రా స్క్రీనింగ్ జరగడం విశేషం. మరి బిగ్ స్క్రీన్ పైకి ఎప్పుడు వస్తుందో.
This post was last modified on August 24, 2024 12:53 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…