కల్కి 2898 ఏడిలో ప్రభాస్ ని ఉద్దేశించి ఇటీవలే బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లు ఎంత దూరం వెళ్ళాయో చూస్తున్నాం. పలువురు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయగా మా అసోసియేషన్ తరఫున మంచు విష్ణు ఏకంగా సినీటాకి ఫిర్యాదు చేశాడు. నాని ఒక ప్రెస్ మీట్ లో కౌంటర్ వేశాక మాట వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. సుధీర్ బాబు తదితరులు ఈ విషయంలో తమ స్వరాన్ని గట్టిగానే వినిపించారు. సహజంగానే ప్రభాస్ ఇవన్నీ పట్టించుకునే రకం కాదు. అంత తీరికా లేదు. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్షన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ క్షణం వచ్చేసింది.
ఎక్స్ వేదికపై ఒక అభిమాని కల్కిలో ఒక వీడియోని షేర్ చేస్తూ బాలీవుడ్ మొత్తం ఈ క్లిప్ కు సాటిరాదని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన నాగ్ అశ్విన్ ఒక మెసేజ్ పెట్టాడు. “వెనక్కు వెళ్లడం వద్దు. ఇకపై నార్త్ సౌత్ లేదా బాలీవుడ్ అనే భేదాలు వద్దు. పెద్ద సినిమాలను లక్ష్యంగా పెట్టుకుందాం. మనదంతా ఒకే పరిశ్రమ. అర్షద్ వార్సి మరింత మెరుగైన పదాలు ఎంచుకుని ఉండాల్సింది. అయినా పర్వాలేదు. అతనికి బుజ్జి బొమ్మలు పంపిస్తాను. వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి పనికి వస్తాయి. మొదటి రోజు మొదటి ఆటకే అదిరిపోయే ప్రశంసలు దక్కేలా కల్కి 2లో ప్రభాస్ ని చూపిస్తానని హామీ ఇస్తున్నాను”.
బుజ్జి బొమ్మలు పంపిస్తానని చెప్పడం ద్వారా ఇన్ డైరెక్ట్ గా పంచు వేసిన నాగ్ అశ్విన్ చాలా పరిణితితో స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అర్షద్ వార్సి ఇప్పటికీ తన కామెంట్ల పట్ల ఎలాంటి క్షమాపణ వ్యక్తం చేయకపోగా మౌనంగా ఉండటంతో నార్త్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరస్పరం గౌరవించుకోవడం అంటే ఏమిటో అమీర్, సల్మాన్, షారుఖ్ లాంటి పెద్ద స్టార్లను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. మొన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న కల్కి 2898 ఏడి ఓటిటిలో ఎలాంటి రికార్డులు సృష్టించనుందో.
This post was last modified on August 24, 2024 11:42 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…