డిప్యూటీ సిఎంగా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాల మీద మెల్లగా దృష్టి పెడుతున్నారు. పెండింగ్ ఉన్న వాటి నిర్మాతలను పిలిపించి వాటి స్టేటస్ ఏంటో కనుక్కుంటున్నారు. ఇప్పటికీ దానయ్య, సుజిత్, జ్యోతికృష్ణలతో మీటింగ్ పూర్తవ్వగా హరీష్ శంకర్, మైత్రి మేకర్స్ కలయికకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పాలన వ్యవహారాలలో తీరిక దొరికే సమయం తక్కువగా ఉండటంతో ప్రాధాన్యత క్రమం ఎలా ఇవ్వాలనే దాని మీద పలు కోణాల్లో డిస్కషన్లు జరిగాయట. ఫ్యాన్స్ విపరీత అంచనాలు పెట్టుకున్న ఓజి సంగతి ముందు చూద్దాం.
కనీసం ఇంకో నలభై రోజులు డేట్లు ఇస్తే సుజిత్ మొత్తం పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక షెడ్యూల్ ముంబైలో ప్లాన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఇక్కడే హైదరాబాద్ లేదా ఏపిలో మేనేజ్ చేయాలంటే అదనంగా చాలా ఖర్చుని భరించాల్సి ఉంటుంది. పైగా ఒక ఫారిన్ ప్లానింగ్ కూడా ఉందట. వీటికి ప్రత్యాన్మయం ఉందా లేదానే దాని మీద త్వరలో ఒక నిర్ధారణకు రావొచ్చు. హరిహర వీరమల్లుకి అమరావతికి దగ్గరలో గ్రీన్ మ్యాట్ వేసి తీసే ఆలోచన ఏఎం రత్నం చేస్తున్నారట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లిస్టు చివరిలో ఉంది. కొంత లేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఈ మూడు సినిమాలు కాకుండా పవన్ ఇకపై కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేనని చెబుతున్నారట. బాలయ్య తరహాలో రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కేవలం గెలిచిన ఎమ్మెల్యే మాత్రమే కాదు. ఉప ముఖ్యమంత్రితో పాటు నాలుగు కీలక శాఖలు చేతిలో ఉన్నాయి. కాబట్టి బాలయ్యను ఫాలో అయ్యే ఛాన్స్ లేదు. సురేందర్ రెడ్డితో రామ్ తాళ్ళూరి ప్లాన్ చేసుకున్న యాక్షన్ మూవీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. చూస్తుంటే నాలుగున్నర ఏళ్ళలో పవన్ అభిమానులు పైన చెప్పిన మూడు సినిమాలతోనే సర్దుకునే పరిస్థితి రావొచ్చు. మహా అయితే ఇంకొక్కటి తోడవ్వచ్చు.
This post was last modified on August 23, 2024 5:06 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…