గత వారం ఆగస్ట్ 15 విడుదల కావాల్సిన సినిమాల్లో ఇంతకు ముందు సురేష్ ప్రొడక్షన్స్ ’35 చిన్న కథ కాదు’ ఉంది. పది రోజుల ముందు వరకు ఇదే డేట్ కి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు.
ఆయ్ తరహాలో కంటెంట్ మీద నమ్మకమైతే ఉంది కానీ విపరీతమైన పోటీ మధ్య దిగడం సేఫ్ కాదని గుర్తించి తప్పుకున్నారు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ అంత దారుణమైన ఫలితాలు అందుకుంటాయని ఎవరూ ఊహించరు కాబట్టి ఇలా మార్చుకోవడం సహజం. అయితే తాజా రిలీజ్ డేట్ కోసం పెద్ద ధైర్యం చేయాలని నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం.
సెప్టెంబర్ 5న 35 చిన్న కథ కాదుని థియేటర్లలో తీసుకురావాలని ఫిక్సయినట్టు తెలిసింది. అధికారిక ప్రకటన రానుంది. ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్లు వేయాలనే ఆలోచన కూడా జరుగుతోందిట. అయితే ఇక్కడ కొన్ని రిస్కులున్నాయి. అదే రోజు ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ కానుంది.
విజయ్ మార్కెట్ గత కొన్నేళ్లలో ఇక్కడ బాగా పెరిగింది. లియో యావరేజ్ టాక్ తోనూ మంచి వసూళ్లు రాబట్టడం చూశాం. తుపాకీ తర్వాత అతనికి కమర్షియల్ ఫెయిల్యూర్ లేకపోవడం బిజినెస్ రేంజ్ ని ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంది.
రెండు రోజుల గ్యాప్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి సుహాస్ జనక అయితే గనకని మంచి ప్లానింగ్ తో తెస్తున్నారు. రాజ్ తరుణ్ భలే ఉన్నాడేకి మారుతీ టీమ్ అండదండలున్నాయి కాబట్టి దీనికీ స్క్రీన్లు దక్కుతాయి. సో ప్రీమియర్ కు సిద్ధపడటం వల్ల 35 చిన్న కథ కాదు ముందస్తు అడ్వాంటేజ్ తీసుకుంటుందో లేదో టాక్ మీద ఆధారపడి ఉంటుంది.
ప్రియదర్శి, నివేతా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ తదితరులు నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు నంద కిషోర్ ఏమని దర్శకత్వం వహించాడు. నిర్మాతల్లో ఒకడైన దగ్గుబాటి రానా ప్రత్యేక శ్రద్ధతో ప్రమోషన్లను దగ్గరుండి చూసుకుంటున్నాడు.
This post was last modified on August 23, 2024 11:38 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…