గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నా దానికన్నా ఎక్కువ ఆసక్తిగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా ఆర్సి 16. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ పాత్రలో ఫుల్ కామెడీ టచ్ ఉంటుందనే వార్త విని అభిమానులు షాకయ్యారు.
హీరో మోటో కార్ప్ కు సంబంధించిన ఒక లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నాక స్వయంగా చరణే ఈ ముచ్చట పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే పెద్ది అనే టైటిల్ తప్ప ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఎలాంటి లీక్ ఇప్పటిదాకా బయటికి రాలేదు.
చరణ్ గతంలో నాయక్ లాంటి చిత్రాల్లో కామెడీ చేశాడు కానీ వాటిలో బ్రహ్మానందం లాంటి ఆర్టిస్టుల సపోర్ట్ వల్ల అవి వర్కౌట్ అయ్యాయి. కానీ బుచ్చిబాబు సోలోగా రామ్ చరణ్ తోనే హాస్యం చేయించేలా రాసుకున్నాడట.
అలాని ఇదేమి కేవలం ఎంటర్ టైనర్ గా ఉండదని ఇన్ సైడ్ టాక్. ఫస్ట్ హాఫ్ లో ఫన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయని, రెండో సగంలో సీరియస్ ఎలిమెంట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయని అంటున్నారు.
చిరంజీవి కామెడీ టైమింగ్ చంటబ్బాయి, దొంగమొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్స్ లో ఓ రేంజ్ లో పేలేలా ఉంటుంది.
కానీ రామ్ చరణ్ మీద అంత ఫుల్ లెన్త్ హాస్యాన్ని ఎవరూ ట్రై చేయలేదు. ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆచార్యలో క్యామియో చేసి డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత గేమ్ ఛేంజర్ తో రాబోతున్నాడు. బుచ్చిబాబుది ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఫ్యాన్స్ 2026 సంక్రాంతిని కోరుకుంటున్నారు.
అయితే అదే సీజన్ కి మైత్రినే నిర్మిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఉంది కనక ఖచ్చితంగా సాధ్యమవుతుందో లేదో చెప్పలేం.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆర్సి 16 అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
This post was last modified on August 23, 2024 11:35 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…