రెండు నెలల కిందట తెలుగులో ‘మహారాజ’ అనే సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది. కానీ రిలీజ్ తర్వాత అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో విజయ్ సేతుపతి హీరో. అతడికి నటుడిగా గొప్ప పేరుంది. క్యారెక్టర్, విలన్ పాత్రల్లో అదరగొట్టేస్తుంటాడు. కానీ సోలో హీరోగా చేసిన సినిమాల్లో విజయాలు తక్కువే.
ఒక దశలో సోలో హీరోగా వరుసగా ఫ్లాపులు రావడంతో అవి ఆపేశాడు. క్యారెక్టర్, విలన్ రోల్సే చేస్తూ సాగాడు. ఐతే కెరీర్లో 50వ సినిమా మైలురాయి ముంగిట నిలవడంతో సేతుపతి సోలో హీరోగా ‘మహారాజ’ సినిమ ా చేశాడు. దీనికి అదిరిపోయే కథను ఎంచుకోవడంతో సినిమా సూపర్ హిట్ అయింది.
ఓటీటీలో ఈ చిత్రం మరింతగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ ఏడాది మోస్ట్ వ్యూడ్ ఇండియన్ మూవీగా రికార్డు కూడా సృష్టించింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు సోలో హీరోగా మరో సెన్సేషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సేతుపతి. ఆ చిత్రమే.. ట్రైన్.
తమిళంలో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మిస్కిన్. రాజు భాయ్ ఒరిజినల్ ‘చిత్తిరం పేసిదడి’తో మొదలుపెడితే అంజాదే, నందలాల, యుద్ధం సెయ్, సైకో, తుప్పరివాలన్ (డిటెక్టివ్), పిశాచి లాంటి మూవీస్‌తో తనకంటూ ప్రత్యేకంగా ఓ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నాడు మిస్కిన్.
ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ తీస్తూ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతాడు మిస్కిన్. ఇలాంటి దర్శకుడు.. సేతుపతి లాంటి మేటి నటుడితో జట్టు కట్టడం ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించేదే. విశేషం ఏంటంటే.. ఇందులో శ్రుతి హాసన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.
‘ట్రైన్’ కోసం సేతుపతి బాగా గడ్డం పెంచి చిత్రమైన లుక్‌లో కనిపిస్తున్నాడు. దీని ఆన్ లొకేషన్ పిక్స్ చూస్తుంటే.. సినిమా కథ అంతా ఒక ట్రైన్లోనే నడిచేలా కనిపిస్తోంది. మరి ఆ రైలు బండిలో మిస్కిన్ ఎంత రసవత్తరంగా కథను నడిపిస్తాడో.. సేతుపతి ఇందులో నటుడిగా తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడో చూడాలి.
This post was last modified on August 23, 2024 8:05 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…