బాలీవుడ్లో అర్షద్ వార్సికి నటుడిగా మంచి పేరే ఉంది. కానీ ఈ మధ్య అవకాశాలు తగ్గిపోయాయి. వ్యక్తిత్వ పరంగా కూడా అర్షద్‌కు మంచి పేరే ఉంది కానీ.. ఇటీవల ఓ పాడ్ కాస్ట్‌లో అతను నోరు జారాడు. ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ పాత్ర జోకర్ లాగా ఉందని వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
నేరుగా ప్రభాస్‌ను అనకపోయినా.. తన పాత్రను ఉద్దేశించి కూడా అలాంటి వ్యాఖ్య చేయడం సబబు కాదు. అజాత శత్రువులా ఉండే ప్రభాస్ గురించి ఇలాంటి కామెంట్ చేసేసరికి మన నెటిజన్లకు అస్సలు రుచించలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాక అందరూ దీన్ని ఖండించారు.
ప్రభాస్ సాధిస్తున్న విజయాలు చూసి అసూయతోనే అర్షద్ లాంటి నటులు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటూ మొత్తంగా బాలీవుడ్‌నే తప్పుబట్టారు. దీనిపై కొందరు సెలబ్రెటీలు కూడా స్పందించారు. అందులో నాని ఒకరు.
తన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్ల సందర్భంగా అర్షద్ వార్సి వ్యాఖ్యల గురించి అడిగితే.. ఆ వ్యక్తి జీవితంలో అతి పెద్ద పబ్లిసిటీ ఇప్పుడే వచ్చి ఉంటుందని నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది నార్త్ ఇండియన్ నెటిజన్ల దృష్టికి కూడా వెళ్లింది. వాళ్లకు ఈ వ్యాఖ్యలు రుచించలేదు. రివర్సులో నానిని టార్గెట్ చేస్తున్నారు.
దక్షిణాది సినిమాలను తాము నెత్తిన పెట్టుకుంటుంటే.. ఉత్తరాది నటుల గురించి ఇలా మాట్లాడతారా.. అర్షద్ ప్రభాస్ పాత్రను అంటే, ప్రభాస్‌ను అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడం ఏంటి అంటూ వాళ్లు మండిపడుతున్నారు. ‘సరిపోదా శనివారం’ హిందీలో కూడా రిలీజవుతున్న నేపథ్యంలో నానిని లక్ష్యంగా చేసుకుంటూ ఈ సినిమా నార్త్ ఇండియాలో ఎలా ఆడుతుందో చూస్తామని వార్నింగ్స్ ఇస్తున్నారు.
This post was last modified on August 23, 2024 8:00 am
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్‌లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…