ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు మాత్రమే కాదు. గొప్ప వ్యక్తి కూడా. ఎంత ఎదిగినా కించిత్ అయినా గర్వం లేకుండా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం.. ఆయన చూపించే వినయం.. వివిధ సందర్భాల్లో ఆయన పెద్ద మనసు.. ఇప్పుడు చర్చకు వస్తోంది. ఆయన మరణించిన నేపథ్యంలో బాలుకు సంబంధించిన అరుదైన వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి బాలును మరింత గొప్పవాడిని చేస్తున్నాయి. ఆయన ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.
తన అభిమానుల్ని ఆయన ఆదరించే తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన అభిమానులెవరైనా అనారోగ్యం పాలవడం లేదంటే వారి జీవితంలో ఏదైనా పెద్ద నష్టం చవిచూడటం లాంటివి జరిగి తనను వాళ్లు ఒకసారి కలిసి సాంత్వన పొందాలనుకుంటే వారిని స్వయంగా వెళ్లి కలిసేవారట.
ఈ తరహాలోనే శ్రీలంకకు చెందిన ఒక తమిళ అభిమాని కోసం వెళ్లి బాలు కలిసి అతణ్ని అమితానందానికి గురి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో ఆ అభిమాని తన రెండు కళ్లూ కోల్పోయారు. ఆయనకు బాలు అన్నా, ఆయన పాటన్నా అమితమైన ఇష్టం. అతను తనను కలవాలనుకుంటున్నాడని తెలిసి బాలు స్వయంగా శ్రీలంకకు వెళ్లారు. కళ్లు పోయిన ఆ అభిమాని కుర్చీలో కూర్చుని ఉంటే తానెవరో చెప్పకుండా వెనుక నుంచి అతణ్ని తడుముతూ ప్రేమగా మాట్లాడి.. ‘బాలు’ గురించి ప్రస్తావన తెచ్చి.. తనపై అతడికున్న అభిమానమెంతో తెలుసుకుని.. తర్వాత నేనే బాలసుబ్రహ్మణ్యాన్ని అంటూ వెల్లడించి ఆ అభిమానిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు బాలు.
ఇలా బాలు వెళ్లి కలిసిన, తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన అభిమానులు మరెంతో మంది ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలా బాలును కలిసిన ఎంతోమంది ఇప్పుడు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఒక సందర్భంలో శబరిమలైకి వెళ్లి అక్కడ డోలీలు మోసే వారికి పాదాభివందనం చేయడం, అలాగే తనకు ‘పాడుతా తీయగా’లో అవకాశమిచ్చి మరింతగా అభిమానులకు చేరువయ్యేలా చేసిన రామోజీ రావు పాదాలకు మొక్కడం లాంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.
This post was last modified on September 28, 2020 6:29 am
కొన్ని సినీ సిత్రాలు విచిత్రంగా ఉంటాయి. అవి సదరు హీరోలు దర్శకులు చెప్పినప్పుడే బయటికి వస్తాయి. అలాంటిదే ఇది. ఎల్లుండి…
పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ కు చెందిన 26 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడిన సంగతి…
సమంత నిర్మాతగా మారి తీసిన శుభం ఎల్లుండి విడుదల కాబోతోంది. దీని మీద బోలెడంత నమ్మకంతో ఉన్న సామ్ నిన్నటి…
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…
ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…