హిట్ మూవీ ‘స్త్రీ’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘స్త్రీ-2’కు ముందు నుంచి మంచి క్రేజే ఉంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేసిన ‘ఖేల్ ఖేల్ మే’, జాన్ అబ్రహాం కథానాయకుడిగా నటించిన ‘వేదా’ లాంటి పెద్ద సినిమాలు వస్తున్నా.. వాటిని మించి ఈ చిత్రమే క్రేజ్ సంపాదించుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆ చిత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
దీన్ని బట్టే ‘స్త్రీ-2’ మంచి ఓపెనింగ్స్ వస్తాయని.. టాక్ బాగుంటే ఓవరాల్ వసూళ్లు కూడా బాగుంటాయని అంచనా వేశారు. కానీ ట్రేడ్ పండిట్ల అంచనాలను దాటిపోయి ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది ‘స్త్రీ-2’. ముందు రోజు రాత్రి ప్రిమియర్స్ కూడా కలిపితే తొలి రోజే ఏకంగా రూ.64 కోట్లు కొల్లగొట్టి అందరూ విస్తుపోయేలా చేసింది ఈ చిత్రం. ఆ తర్వాత కూడా స్త్రీ-2 ప్రభంజనం కొనసాగుతోంది.
మూడు రోజుల్లోనే రూ.200 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. వీకెండ్ తర్వాత కూడా జోరు తగ్గించలేదు. వారం రోజుల వ్యవధిలోనే రూ.400 కోట్ల మార్కును కూడా దాటేసింది. హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన ఒక సగటు హార్రర్ మూవీకి ఇలాంటి వసూళ్లు ఎవ్వరూ ఊహించనివి.
సినిమాకు క్రేజ్ ఉందని.. మంచి వసూళ్లు వస్తాయని తెలుసు కానీ.. మరీ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ అంచనా వేసి ఉండరు. ఆల్రెడీ ‘స్త్రీ-2’ ఈ ఏడాదికి హైయెస్ట్ హిందీ గ్రాసర్‌గా నిలిచింది. ‘ఫైటర్’, ‘కల్కి’ సినిమాల వసూళ్లను ఆ చిత్రం ఎప్పుడో దాటేసింది. దీని ముందు మిగతా సినిమాలు వెలవెలబోయాయి. ‘స్త్రీ-2’ ఊపు చూస్తుంటే ఇప్పుడే జోరు తగ్గించేలా లేదు.
మినిమం ఇంకో 200 కోట్ల వసూళ్లయినా రాబడుతుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా ఇది రికార్డు నెలకొల్పుతోంది.
This post was last modified on August 22, 2024 1:24 pm
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…