Movie News

సుబ్రహ్మణ్యం.. ఇంతకంటే ఏం కావాలి?

క్యారెక్టర్, విలన్ రోల్స్ చేసే రావు రమేష్ హీరోగా సినిమా అంటే.. ఎందుకొచ్చిన ప్రయాస అన్నట్లే చూశారు జనాలు. కాస్త ఇమేజ్ ఉన్న హీరోలు సినిమాలు చేస్తేనే జనం థియేటర్లకు రావడం కష్టంగా మారిన ఈ రోజుల్లో రావు రమేష్ లీడ్ రోల్ అంటే ఏం చూస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ సినిమాలో విషయం ఉంటే.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తే.. వాళ్లు కంటెంట్ కోసం థయిేటర్లకు వస్తారని ఇటీవలే కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ లాంటి చిన్న సినిమాలు రుజువు చేశాయి. ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’లో కంటెంట్ ఏ స్థాయిలో ఉంది అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది కానీ.. ఈ లోపు ప్రోమోలు, పబ్లిసిటీతో ప్రేక్షకుల దృష్టిని ఈ చిత్రం బాగానే ఆకర్షిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఎంటర్టైనింగ్‌గా ఉండి ఆడియన్స్‌లో ఆసక్తి పెంచాయి. విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది.

రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ కూడా వస్తోంది. సుకుమార్ సతీమణి తబితకు ఈ సినిమా నచ్చి ప్రెజెంటర్‌గా మారడంతో ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ దశ తిరిగిందని చెప్పొచ్చు.

ఆమె సుకుమార్‌కు చూపించడం, ఆయనకు నచ్చడం.. దీంతో సినిమాను తబిత ప్రెజెంట్ చేయడానికి ఒప్పుకోవడం.. ప్రి రిలీజ్ ఈవెంట్‌‌కు తనతో పాటు అల్లు అర్జున్‌ను తీసుకురావడం బాగా ప్లస్ అయ్యాయి. సినిమా గురించి సుకుమార్ చెప్పిన మాటలతో అందరికీ ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’పై అందరికీ గురి కుదురుతోంది.

అల్లు అర్జున్ రాక, తన స్పీచ్‌తో సినిమాకు బోలెడంత పబ్లిసిటీ వచ్చింది సోషల్ మీడియాలో. ఇది ‘మారుతినగర్’ బుకింగ్స్‌కు కచ్చితంగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. మామూలుగా ఈ స్థాయి సినిమాలకు చాలినన్ని షోలు ఇవ్వరు. ఇచ్చిన షోలకు కూడా మినిమం టికెట్లు తెగక షోలు క్యాన్సిల్ అవుతాయి. కానీ ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’కు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రోమోల్లో ఉన్నంత స్ట్రైకింగ్‌గా సినిమా కూడా ఉంటే హీరోగా రావు రమేష్‌కు మంచి హిట్ పడబోతున్నట్లే.

This post was last modified on August 22, 2024 1:21 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

7 hours ago