Movie News

విశ్వంభర గురించి వసిష్ఠ ఎలివేషన్లు

భోళా శంకర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చిరంజీవి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పుట్టినరోజు సందర్భంగా నిమిషం నిడివి ఉన్న టీజర్ వస్తుందనే వార్త వచ్చింది కానీ ఖరారుగా తెలియడం లేదు. ఇదిలా ఉండగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విశ్వంభరుడు అనే ఆన్ లైన్ ప్రోగ్రాంకి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విశిష్ట ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగించే మాటలు చెప్పాడు. సినిమా గురించి ఎంతైనా ఊహించుకోమని, అంతకు పదింతలు ఎక్కువ సంతృప్తి చెందేలా ఒక అభిమానిగా సినిమా తీశానని అన్నాడు.

ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూపించడంతో పాటు ఇప్పటిదాకా ఎవరూ అన్నయ్యతో చేయని సబ్జెక్టుని హ్యాండిల్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. స్వయంగా ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఖచ్చితంగా అంచనాలు అందుకుంటుందని ఊరించాడు. అయితే టీజర్ అనౌన్స్ మెంట్ త్వరలో ఉంటుందని చెప్పాడు కానీ బర్త్ డే గిఫ్టని మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వీడియో బైట్ తో ఒక్కసారిగా విశ్వంభర ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇంద్ర 4K ప్రింట్ తో పాటు అటాచ్ చేస్తారనే టాక్ వచ్చినా అది నిజం కాదు. థియేటర్లలో ప్రదర్శించాలంటే ముందు సెన్సార్ అవ్వాలి. కానీ జరగలేదని సమాచారం.

జనవరి 10 విడుదల కాబోతున్న విశ్వంభర ఖచ్చితంగా సంక్రాంతి విజేతగా నిలుస్తుందని వశిష్ట చెప్పడం చూస్తే కంటెంట్ మాములుగా ఉండేలా కనిపించడం లేదు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాలో ఆశికా రంగనాథ్, సురభి లాంటి గ్లామర్ ఆకర్షణలు చాల ఉన్నాయి. మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించింది కానీ కన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న విశ్వంభరలో అయిదు పాటలు ఉంటాయని టాక్. విశ్వంభర తర్వాత దర్శకుడు మోహన్ రాజాతో చేయబోయే సినిమా వార్త ఉంది కానీ దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

This post was last modified on August 22, 2024 10:11 am

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

1 hour ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

4 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

4 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

6 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

7 hours ago